వాయువేగంతో
ABN, Publish Date - Jul 15 , 2024 | 12:22 AM
భోగాపురంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణ పనులు స్పీడందుకున్నాయి. సీఎం చంద్రబాబు వచ్చి పనులపై సమీక్షించాక మరింత వేగంగా సాగుతు న్నాయి. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ప్రత్యేకంగా దృష్టిసారించడంతో చాలా తక్కువ సమయంలోనే ఎయిర్‌పోర్టు పూర్తి కావొచ్చునని అంతా భావిస్తున్నారు. పనులను పరిశీలిస్తున్న స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వాయువేగంతో
చురుగ్గా భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాక తర్వాత మరింత ముమ్మరం
ప్రత్యేకంగా దృష్టిసారించిన కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు
భోగాపురం, జూలై14: భోగాపురంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణ పనులు స్పీడందుకున్నాయి. సీఎం చంద్రబాబు వచ్చి పనులపై సమీక్షించాక మరింత వేగంగా సాగుతు న్నాయి. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ప్రత్యేకంగా దృష్టిసారించడంతో చాలా తక్కువ సమయంలోనే ఎయిర్‌పోర్టు పూర్తి కావొచ్చునని అంతా భావిస్తున్నారు. పనులను పరిశీలిస్తున్న స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం గతంలో టీడీపీ హయాంలోనే సుమారు 5300 ఎకరాలకు పైగా అవసరమని ప్రకటించగా అంత భూమిని ఇవ్వబోమని ప్రజలు వ్యతిరేకించడంతో వారికి అనుకూలంగా 2700 ఎకరాలకు కుదించారు. అనంతరం 2016లో ప్రజా వేదిక ఏర్పాటు చేసి ప్రజల నుంచి అంగీకారం పొందారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని 2023నాటికి విమానాశ్రయ నిర్మాణం పూర్తి చేయాలనే సంకల్పంతో రెండున్నరేళ్లలో భూసేకరణ ప్రక్రియను చివరి దశకు తీసుకొచ్చారు. 2019 ఫిబ్రవరి14న ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అప్పటి, ప్రస్తుత ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. అయితే అన్యూహంగా ప్రభుత్వం మారడంతో ముఖ్యమంత్రి అయిన జగన్ ఎయిర్ పోర్టును నాలుగేళ్లు విస్మరించారు. ఏడాది కింద మళ్లీ శంకుస్థాపన చేసి కేవలం ఎన్నికలకు ఆరు నెలల ముందు పనులను తెరపైకి తెచ్చారు. నిర్వాసితుల సమస్యలను కూడా వదిలేశారు. ఈ ఏడాది సాధారణ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన కూటమి ప్రభుత్వం కొలువుదీరిన కొద్ది రోజుల్లోనే ఎయిర్‌పోర్టుపై దృష్టిసారించింది. మూడు రోజుల కిందట సీఎం చంద్రబాబే స్వయంగా వచ్చి పనులపై సమీక్షించారు. 2026 నాటికి అందుబాటులోకి తేవాలని నిర్దేశించారు.
- శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు కేంద్ర పౌరవిమానయానశాఖా మంత్రికావడంతో ఉత్తరాంధ్ర ప్రజల్లో మరింతగా ఆశలు రేకెత్తాయి. కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిననాడే భోగాపురం ఎయిర్‌పోర్టుకు మొదటి ప్రాధాన్యం ఇస్తామన్నారు. అన్నట్టుగానే ఇక్కడి పనులపై దృష్టిసారించారు.
- విమానశ్రయ నిర్మాణ పనులు పగలూ రాత్రీ తేడా లేకుండా జెట్ వేగంతో నిర్వహిస్తున్నారు. రన్‌వే, జోన్2 విభాగం, పాసింజర్ టెర్మినల్ భవనం, ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్, ఎయిర్‌పోర్టు తాగునీటికి సంబంధించిన పైపులైన్ల నిర్మాణం స్పీడుగా సాగుతోంది. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు తగిన విధంగా భవిషత్తును దృష్టిలో ఉంచుకొని అవసరమైన అన్ని సౌకర్యాలతో ఎయిర్‌పోర్టు నిర్మాణ పనుల్లో వేగం పుంజుకుంది. బీచ్‌కారిడార్, మెట్రోరైలు వంటివి తీసుకొస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించడంతో మరోమూడు, నాలుగేళ్లలో ఈప్రాంతం రూపులేఖలే మారిపోతాయని, స్థానికులకు ఉద్యోగాలు వస్తాయని జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Jul 15 , 2024 | 12:22 AM