ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్లాస్టిక్‌ నిషేధం అమలయ్యేనా..!

ABN, Publish Date - Sep 06 , 2024 | 12:10 AM

విజయనగరంలో ప్లాస్టిక్‌ నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తామని అధికారులు మరోసారి ప్రకటించారు. ఈదఫా పక్కా ప్రణాళికతో చర్యలు చేపడ్తామని, తనిఖీలు ముమ్మరం చేస్తామని చెబుతున్నారు. ప్రజలు మాత్రం సందేహం వ్యక్తం చేస్తున్నారు.

జమ్మురోడ్డులో పేరుకుపోయిన ప్లాస్టిక్‌ వ్యర్థాలు

ప్లాస్టిక్‌ నిషేధం

అమలయ్యేనా..!

ఈసారి కఠినంగా ఉంటామంటున్న కార్పొరేషన్‌ అధికారులు

నగరంలో విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ వ్యర్థాలు

70 దుకాణాల్లో విక్రయాలు

విజయనగరంలో ప్లాస్టిక్‌ నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తామని అధికారులు మరోసారి ప్రకటించారు. ఈదఫా పక్కా ప్రణాళికతో చర్యలు చేపడ్తామని, తనిఖీలు ముమ్మరం చేస్తామని చెబుతున్నారు. ప్రజలు మాత్రం సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్రకటించడం.. పట్టించుకోకపోవడం అధికారులకు అలవాటని కొట్టిపారేస్తున్నారు. నగరంలో విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ వ్యర్థాలు పేరుకుపోతున్న పరిస్థితిలో భవిష్యత్‌లో ఎలాంటి ముప్పు రాకూడదంటే ప్లాస్టిక్‌ నిషేధం తక్షణ అవసరమని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు.

(విజయనగరం రింగురోడ్డు)

ప్లాస్టిక్‌ నిషేధంపై గతంలో లెక్కలేనన్నిసార్లు అధికారులు ప్రకటనలు చేసినా క్షేత్రస్థాయిలో ఆ నిర్ణయం బుట్టదాఖలయ్యేది. అధికారులు నామమాత్రం తనిఖీలు చేయడం, అరకొర జరిమానాలు వేసి చేతులు దులుపేసుకోవడం సర్వసాధారణంగా మా రింది. ప్లాస్టిక్‌ షాపుల యాజమానులు అధికారులను కలిసిన వెంటనే పాలిథిన్‌ నిషేధాన్ని గాలికొదిలేసే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాగా నగరంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి. పాలిథిన్‌ కవర్లు తిని జంతువులు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కాలువల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు నీటి ప్రవాహానికి అడ్డు తగులుతున్నాయి. దీంతో మురుగునీరు రోడ్డుపై వస్తోంది. ప్లాస్టిక్‌ వ్యర్థాలతో పెద్దచెరువుతో పాటు నగరంలోని పలు చెరువులు పూడికపోయే పరిస్థితి నెలకొంది.

- ప్లాస్టిక్‌ వినియోగం వల్ల పర్యావరణానికి నష్టం జరుగుతోందన్న ఉద్దేశంతో 2022 జూలై నుంచి నగరంలో వాటిపై నిషేధం విధించారు.. 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్‌ను వినియోగించవద్దని సూచించారు. నిబంధనలకు వ్యతిరేకంగా విక్రయిస్తున్న వ్యాపారులపై జరిమానా విధించి గోదాములు సీజ్‌ చేసే వరకూ వెళ్లారు. దీంతో సిండికేట్‌గా ఉన్న వ్యాపారులు అప్పటి నగర పాలక సంస్థ కమిషనర్‌ను కలిసి తయారైన కవర్లను వెనక్కి పంపుతామని, ఇంకోసారి అమ్మితే కేసులు నమోదు చేయాలని రాత పూర్వకంగా విన్నవించారు. దీంతో అధికారులు గోదాములు సీజ్‌ చేయకుండా వదిలేశారు. వ్యాపారులు కొద్ది రోజుల తరువాత తిరిగి ప్లాస్టిక్‌ విక్రయాలు ప్రారంభించారు. అంతవరకూ కఠిన ఆంక్షలు విధించిన అధికారులు అటువైపు చూడడం మానేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధులే అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి ప్లాస్టిక్‌ దుకాణాల వైపు వెళ్లొద్దని హుకుం జారీ చేసినట్టు సమాచారం.

- రైతుబజార్లు, కూరగాయల దుకాణాలు, కిరణాషాపులు, మాంసంకొట్లు, టిఫిన్‌ బడ్డీలు, పండ్ల దుకాణాల్లో ఎక్కడ చూసినా పాలిథిన్‌ కవర్లు, ప్లాస్టిక్‌ కప్పులు ప్రస్ఫుటంగా కన్పిస్తున్నాయి. జిల్లాలో ప్రతిరోజు దాదాపు 200 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. అందులో ప్లాస్టిక్‌ వ్యర్థాలే 80 టన్నులు ఉంటోంది.

అమ్మితే చర్యలు

పి.నల్లనయ్య, నగరపాలక సంస్థ, కమిషనర్‌

నిషేధిత పాలిథిన్‌ కవర్లు, ప్లాస్టిక్‌ గ్లాసులు అమ్మడం చట్టారీత్యా నేరం. ఇక నుంచి నగరంలో ప్లాస్టిక్‌ను సంపూర్ణంగా నిషేధిస్తున్నాం. షాపుల్లో ప్లాస్టిక్‌ విక్రయాలు జరిపితే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. వినియోగదారులు కూడా ప్లాస్టిక్‌ వినియోగం కట్టడికి సహకరించాలి.

Updated Date - Sep 06 , 2024 | 12:10 AM

Advertising
Advertising