నో ఫ్లై జోన్‌గా ఓట్ల లెక్కింపు కేంద్రం
ABN, Publish Date - May 26 , 2024 | 12:01 AM
గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర పరిధిలోని ఉద్యాన కళాశాలను నో ఫ్లై జోన్‌గా కలెక్టర్ నిశాంత్‌కుమార్ శనివారం ప్రకటించారు.
పార్వతీపురం, మే25 (ఆంధ్రజ్యోతి)/గరుగుబిల్లి : గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర పరిధిలోని ఉద్యాన కళాశాలను నో ఫ్లై జోన్‌గా కలెక్టర్ నిశాంత్‌కుమార్ శనివారం ప్రకటించారు. జూన్ 4న అరకు పార్లమెంటుకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్‌తో పాటు నాలుగు నియోజకవర్గాలకు చెందిన ఓట్ల లెక్కింపు ఇక్కడే చేపడతామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కారణంగా భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మానవ రహిత వైమానిక వాహనాలు, డ్రోన్‌లు, బెలూన్‌లతో పాటు తదితర వాటిని ఆ ప్రాంతంలో ఎగురవేయడం నిషేధమన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు. ఇప్పటికే పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశామన్నారు. సంబంధిత కౌంటింగ్ హాల్‌లో ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేశామని వెల్లడించారు. నాలుగు నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలు స్ట్రాంగ్ రూముల్లో భద్రపర్చామని, మూడంచెల భద్రతను ఏర్పాటు చేశామని చెప్పారు. తదపరి ఆదేశాల వచ్చేంతవరకు ఉల్లిభద్రలోని కళాశాలతో పాటు యా పరిసరాలు నో ఫ్లై జోన్‌గా ఉంటుందన్నారు.
Updated Date - May 26 , 2024 | 12:01 AM