వదలని ఏనుగులు
ABN, Publish Date - Apr 11 , 2024 | 11:57 PM
జియ్యమ్మవలస మండలాన్ని ఏనుగులు వదలడం లేదు. గతకొన్ని రోజులుగా ఇక్కడే తిష్ఠ వేయడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
- వరి, మొక్కజొన్న పంటలు నాశనం
జియ్యమ్మవలస, ఏప్రిల్ 11: జియ్యమ్మవలస మండలాన్ని ఏనుగులు వదలడం లేదు. గతకొన్ని రోజులుగా ఇక్కడే తిష్ఠ వేయడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మండలంలోని పెదమేరంగి పంచాయతీ రామినాయుడువలస గ్రామంలో బుధవారం రాత్రి నుంచి ఏనుగుల గుంపు తిష్ఠ వేసింది. సమీప పంట పొలాల్లో గురువారం మధ్యాహ్నం సేదతీరాయి. అరటి, మొక్కజొన్న, వరి పంటలను నాశనం చేయడంతో రైతులు లబోదిబోమంటున్నారు. గురువారం సాయంత్రం కన్నపుదొరవలస గ్రామ పొలిమేరకు చేరుకొని అక్కడ పంటలను కొంతమేర నష్టపరిచినట్లు రైతులు చెబుతున్నారు. వాటి దగ్గరకు ఎవరినీ వెళ్లనీయకుండా ట్రాకర్లు చర్యలు తీసుకుంటున్నారు. ఏనుగుల వల్ల పొలాలకు వెళ్లలేకపోతున్నామని, పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని రైతులు వాపోతున్నారు. ఇక్కడి నుంచి వాటిని పూర్తిస్థాయిలో తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.
Updated Date - Apr 11 , 2024 | 11:57 PM