ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మెనూ పక్కగా అమలు చేయాలి

ABN, Publish Date - Jul 28 , 2024 | 11:06 PM

సీతంపేట ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో మెనూ పక్కాగా అమలు చేయాలని పీవో రాహుల్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఆదివారం ఆయన మన్యంలో సుడిగాలి పర్యటన చేశారు.

శంభాం పాఠశాల విద్యార్థులతో మాట్లాడుతున్నపీవో

సీతంపేట: సీతంపేట ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో మెనూ పక్కాగా అమలు చేయాలని పీవో రాహుల్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఆదివారం ఆయన మన్యంలో సుడిగాలి పర్యటన చేశారు. తొలుత శంభాం గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. అక్కడి మెనూను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి పాఠశాలలో అందిస్తున్న బోధన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మల్లి గురుకుల పాఠశాలను సందర్శించారు. తాగునీరు సమస్యపై సిబ్బందితో మాట్లాడారు. దాని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. సీతంపేటలో జరిగే వారపు సంతను పరిశీలించారు. ఈ సందర్భంగా పైనాపిల్‌, గిరిజన ఉత్పత్తుల ధరలను గిరిజనులకు అడిగి తెలుసుకున్నారు. సంత అనంతరం పరిసరాలను శుభ్రం చేయాలని స్థానికులకు సూచించారు. అనంతరం ఆడలి వ్యూపాయింట్‌ పనులను పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులకు ఆదేశించారు. ఈ పరిశీలనలో గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ ఈఈ సింహాచలం, జేఈ నాగభూషణ్‌, ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం సుందరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 28 , 2024 | 11:06 PM

Advertising
Advertising
<