ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నిందితుడిని కఠినంగా శిక్షించాలి

ABN, Publish Date - Jul 15 , 2024 | 12:12 AM

పసికందుపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని, న్యాయవాదులు వారికి సహకరించవద్దని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కోరారు.

సాలూరు: పసికందుపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని, న్యాయవాదులు వారికి సహకరించవద్దని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కోరారు. ఆదివారం ఉదయం సాలూరులోని తన నివాసంలో ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడారు. రామభద్రపురం మండలం జిలుగువలస గిరిజన గ్రామంలో సభ్యసమాజం తలదించుకునేలా మానవ మృగంలా ప్రవర్తించిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఐదు నెలల పసికందుపై అత్యాచారం చేసిన వైనం తనను తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసిందని అన్నారు. ఈ విషయంపై న్యాయవాదులు చాలా సీరియస్‌గా తీసుకోవాలని కోరారు. ఇలాంటి వ్యక్తులు సమాజంలో తిరిగే అవకాశం లేదన్నారు. ఎవ్వరూ కూడా బెయిల్‌ ఇవ్వవద్దని కోరారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు.

Updated Date - Jul 15 , 2024 | 12:13 AM

Advertising
Advertising
<