ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఆ స్థలం మాదే..

ABN, Publish Date - Apr 18 , 2024 | 11:35 PM

సుమారు పదేళ్ల కిందట నిర్మించిన రహదారిని ఓ వైసీపీ నాయకురాలి ఆధ్వర్యంలో తవ్వేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. తమ పొలానికి ఆనుకుని రోడ్డు నిర్మించారని.. ఈ స్థలం తమదని చెప్పుకొస్తున్నారు. అయితే దీనిపై ఆయా ప్రాంత గిరిజనులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వేసిన రహదారిని తవ్వేస్తున్న దృశ్యం

అడ్డుకున్న దెబ్బగడ్డ గిరిజనులు

పదేళ్ల తర్వాత గుర్తుకొచ్చిందా? అంటూ నిలదీత

పార్వతీపురం రూరల్‌: సుమారు పదేళ్ల కిందట నిర్మించిన రహదారిని ఓ వైసీపీ నాయకురాలి ఆధ్వర్యంలో తవ్వేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. తమ పొలానికి ఆనుకుని రోడ్డు నిర్మించారని.. ఈ స్థలం తమదని చెప్పుకొస్తున్నారు. అయితే దీనిపై ఆయా ప్రాంత గిరిజనులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు గురువారం రహదారి తవ్వకాలను అడ్డుకుని నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళ్తే..

పార్వతీపురం మండలం డీకే పట్నం నుంచి మక్కువ మండలం దెబ్బగడ్డ గిరిజన గ్రామం వరకు 2014లో సుమారు రూ. 49 లక్షలతో ఉపాధి హామీ పథకం కింద రోడ్డు నిర్మించారు. దీంతో డీకేపట్నంతో పాటు దెబ్బగడ్డ, ఇతర గిరిజన గ్రామాల ప్రజలకు రోడ్డు కష్టాలు తీరాయి. వారి రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. అయితే తాజాగా డీకే పట్నం గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకురాలి ఆధ్వర్యంలో రోడ్డు విధ్వంసం మొదలైంది. తమ పొలాన్ని కలుపుకొని అప్పట్లో రహదారి నిర్మించారంటూ సదరు నాయకురాలు ఆరోపిస్తుండగా.. మరోవైపు ఈ నెల 17 నుంచి రోడ్డు తవ్వకం పనులు ప్రారంభించారు. అంతేకాకుండా ఆ ప్రదేశంలో గ్రావెల్‌ వేస్తుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఆయా ప్రాంత గిరిజనులు అభ్యంతరం తెలియజేస్తున్నారు. దెబ్బగడ్డ గిరిజనులతో పాటు డీకే పట్నానికి చెందిన టీడీపీ నేతలు జి.లక్ష్మణరావు, గంట సాయి రామకృష్ణ తదితరులు గురువారం రోడ్డు తవ్వకాల పనులను అడ్డుకున్నారు. పదేళ్ల తర్వాత ఇప్పుడు ఈ స్థలం గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్నించారు. దీనిపై ఐటీడీఏ పీవో విష్ణుచరణ్‌, గిరిజన ఇంజనీరింగ్‌ అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని ఈ ప్రాంత గిరిజనులు డిమాండ్‌ చేస్తున్నారు.

రహదారి తవ్వడం దారుణం

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రహదారి నిర్మించాం. కానీ పదేళ్ల తర్వాత ప్రస్తుతం అధికార పార్టీకి చెందిన నాయకురాలు రహదారిని విధ్వంసం చేయడం దారుణం. 2014లో వేసిన ఈ రహదారి ఈ ప్రాంత గిరిజనులకు ఎంతో ఉపయోగకరగా ఉండేది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలి.

- జి.లక్ష్మణరావు, గంట సాయి కృష్ణ, టీడీపీ ప్రతినిధులు, డీకే పట్నం, పార్వతీపురం మండలం

Updated Date - Apr 18 , 2024 | 11:35 PM

Advertising
Advertising