ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యుదాఘాతంతో పారిశుధ్య కార్మికుడు..

ABN, Publish Date - Jul 05 , 2024 | 12:09 AM

విద్యుత్‌షాక్‌తో పారిశుధ్య కార్మికుడు మృతి చెందిన ఘట న మండలంలో చోటు చేసుకుంది.

డెంకాడ, జూలై 4: విద్యుత్‌షాక్‌తో పారిశుధ్య కార్మికుడు మృతి చెందిన ఘట న మండలంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి డెంకాడ ఎస్‌ఐ కృష్ణమూర్తి, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో సింగవరం గ్రామానికి చెందిన బంగారి(54) పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం లంకపేట గ్రామంలో ఓ తాగునీటి మోటారు పంప్‌ వద్ద కలుపును తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు కొడవలితో విద్యుత్‌ వైర్ల కోసేయడంతో విద్యుత్‌ షాక్‌కి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. డెంకాడ ఎస్‌ఐ కృష్ణమూర్తి, ఎంపీడీవో లోవరాజు, సింగవరం సర్పంచ్‌ అప్పా రావు, మాజీ సర్పంచ్‌ లెంక అప్పలనాయుడు, మాజీ ఎంపీటీసీ సభ్యులు కూర్మా రావు ఘటనా స్థలానికి చేరుకుని కుటుంబసభ్యులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భోగాపురం మండలం సుంకరిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కుటుంబ పెద్ద దిక్కును కొల్పోయామని మృతుని భార్య లక్ష్మి, కుమార్తె రమణమ్మ విలపించారు.

Updated Date - Jul 05 , 2024 | 12:09 AM

Advertising
Advertising