ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఆటోలు ఢీ.. వృద్ధురాలి మృతి

ABN, Publish Date - Jun 17 , 2024 | 12:16 AM

కొత్తవలస పంచాయతీ అడ్డూరివానిపాలె గ్రామం సమీపంలో శనివారం రాత్రి ఎదురెదురుగా వెళుతున్న రెండు ఆటోలు ఢీకొన్న ఘటనలో వృద్ధురాలు మృతి చెందగా మరో నలగురికి తీవ్రగాయాలయ్యాయి. ఇందుకు సంబంధించి కొత్తవలస సీఐ వి.చంద్రశేఖరరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కొత్తవలస, జూన్‌ 16: కొత్తవలస పంచాయతీ అడ్డూరివానిపాలె గ్రామం సమీపంలో శనివారం రాత్రి ఎదురెదురుగా వెళుతున్న రెండు ఆటోలు ఢీకొన్న ఘటనలో వృద్ధురాలు మృతి చెందగా మరో నలగురికి తీవ్రగాయాలయ్యాయి. ఇందుకు సంబంధించి కొత్తవలస సీఐ వి.చంద్రశేఖరరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తవలస నుంచి శృంగవరపుకోట వెళుతున్న ఆటో, శృంగవరపుకోట వైపు నుంచి కొత్తవలస వస్తున్న ఆటో శనివారం రాత్రి ఎదురెదురుగా ఢీకొ న్నాయి. లక్కవరపుకోట మండలం, మల్లివీడు గ్రామానికి చెందిన లెంక జయమ్మ(60) తీవ్రగాయమై చికిత్స కోసం విశాఖపట్టణం తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. ఇదే ప్రమాదంలో పెదిరెడ్డిలక్ష్మి, పి.నిర్మల, కర్రి సత్యనారాయణ, కర్రి మంగమ్మ తీవ్రంగా గాయపడ్డంతో వీరిని విశాఖపట్టణం కేజీహెచ్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్లపై కేసునమోదు చేసినట్టు సీఐ తెలిపారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టెం నిమిత్తం తరలించినట్టు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందన్నారు.

Updated Date - Jun 17 , 2024 | 12:16 AM

Advertising
Advertising