ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పిచ్చి కుక్క స్వైరవిహారం

ABN, Publish Date - Apr 20 , 2024 | 12:13 AM

బొండపల్లి గ్రామంలో పిచ్చి కుక్క స్వైరవిహారం చేసి పలువురిని గాయపరిచింది.

బొండపల్లి, ఏప్రిల్‌ 19: బొండపల్లి గ్రామంలో పిచ్చి కుక్క స్వైరవిహారం చేసి పలువురిని గాయపరిచింది. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం ఉదయం గ్రామంలోని యాత వీధిలో ఓ పిచ్చికుక్క ఆరుబయట ఉన్నవారిపై విచక్షణా రహితంగా దాడిచేసి కరి చింది. దీంతో స్థానికులు కుక్కను కర్రలతో భయపెట్టగా అక్కడ నుంచి జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న టీపాయింట్‌కు స మీపంలో మరికొంతమందిపై దాడిచేసి కరిచింది. అక్కడ నుంచి జాతీయ రహదారి పక్కన తాటిముంజెలు అమ్ముకుంటున్న వారిపై, రోడ్డుపక్కన లారీ ఆపిన డ్రైవర్‌పై కూడా దాడిచేసి గాయపరిచింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన పి.అచ్చియ్యమ్మ, బి.కృష్ణమ్మ, బి.సంతోష్‌, కే.సురేష్‌, పి.రామలక్ష్మి, వై.సన్యా సికి తీవ్ర గాయాలు కాగా వీరిని బొండపల్లిలోని పీహెచ్‌సీలో ప్రథమ చికిత్స అనంతరం గజపతినగరంలోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించారు. బొండపల్లి పీహెచ్‌సీలో నీలాతి రాము, పురం రామ లక్ష్మి, ఎర్ర సన్యాసి చికిత్స పొందుతున్నారు. గ్రామస్థులు అప్రమత్తంగా ఉండా లని దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేసినట్లు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు.

Updated Date - Apr 20 , 2024 | 12:13 AM

Advertising
Advertising