ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

జీసీసీ లక్ష్యం రూ.60కోట్లు

ABN, Publish Date - Apr 25 , 2024 | 11:33 PM

జీసీసీ ఈ ఆర్థిక సంవత్సరం(2024-25)లో వ్యాపార లక్ష్యం రూ.60 కోట్లుగా నిర్ణయించామని జీసీసీ డివిజనల్‌ మేనేజర్‌ ఉరిటి మహేంద్రకుమార్‌ తెలిపారు.

సాలూరు రూరల్‌: జీసీసీ ఈ ఆర్థిక సంవత్సరం(2024-25)లో వ్యాపార లక్ష్యం రూ.60 కోట్లుగా నిర్ణయించామని జీసీసీ డివిజనల్‌ మేనేజర్‌ ఉరిటి మహేంద్రకుమార్‌ తెలిపారు. ఆయన సాలూరు జీసీసీ కార్యాలయంలో సాలూరు, పాచిపెంట, మక్కువ, రామభద్రపురం, మెంటాడ మండలాల సేల్స్‌మెన్లు, సిబ్బందితో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ఆర్థిక సంవత్సరంలో జీసీసీ పార్వతీపురం మన్యం జిల్లాలో దాదాపు రూ.60 కోట్లు వ్యాపార లక్ష్యాన్ని చేరుకుందన్నారు. ఈ ఏడాది రూ.60 కోట్లు లక్ష్యంగా నిర్ణయించినా అంతకు మించి సాధించడానికి సిబ్బంది కృతనిశ్చయంతో పనిచేయాలన్నారు. జీసీసీ సిబ్బంది ఎటువంటి అవకతవకలకు పాల్పడిన కఠిన చర్యలు తప్పవన్నారు. సాలూరులో ఉన్న ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా గోడౌన్‌ ఇన్‌చార్జి సీహెచ్‌ రాములను వివరాలడిగి తెలుసుకున్నారు. మండలాల మ్యాపింగ్‌ మారడం వల్ల సాలూరు నుంచే పాచిపెంట, మక్కువలకు సరుకులు పంపించడంలో సమస్య ఏర్పడుతుందని రాములు వివరించారు. ఈ సమస్యను డీఎస్వో దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ఆయన తెలిపారు. ఈనెల 30 నాటికి సరుకులు డిపోలకు చేరేటట్టు శ్రద్ధ చూపాలని ఆదేశించారు. ఆయనతో జీసీసీ సాలూరు మేనేజర్‌ జె.రామారావు తదితరులున్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:33 PM

Advertising
Advertising