ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సమస్యలను పట్టించుకోరా?

ABN, Publish Date - Aug 24 , 2024 | 11:26 PM

ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోరా అని జేసీ శోభిక మండల స్థాయి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం కాట్రగడ ఓపెన్‌ హెడ్‌ చానల్‌ను సందర్శించారు. వరద కాలువ ముఖద్వారం వద్ద తక్షణమే ఇసుక మేటలను తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు.

ఆర్‌అండ్‌బీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జేసీ

భామిని: ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోరా అని జేసీ శోభిక మండల స్థాయి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం కాట్రగడ ఓపెన్‌ హెడ్‌ చానల్‌ను సందర్శించారు. వరద కాలువ ముఖద్వారం వద్ద తక్షణమే ఇసుక మేటలను తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. రహదారి మరమ్మతులు చేయాల్సి ఉందని, వర్షాలు తగ్గితే చేపడతామనడంతో ఆమె మండిపడ్డారు. మూడు రోజుల్లో రోడ్డు మరమ్మతులు చేసి.. ఇసుక డంపింగ్‌ చేపట్టాలని ఆదేశించారు. సుమారు లక్షా 5 వేల టన్నుల ఇసుక తీయాల్సి వస్తుందని వంశధార డీఈఈ భవానీ శంకర్‌ తెలిపారు. డంపింగ్‌ అయిన వెంటనే ఇసుక మార్కెటింగ్‌ బాధ్యత రెవెన్యూ, మైనింగ్‌ వారు చూస్తారని జేసీ తెలిపారు. అనంతరం అలికాం-బత్తిలి మార్గంలో కొరమ నుంచి బిల్లుమడ రోడ్డును ఆమె పరిశీలించారు. రహదారి పూర్తిగా పాడవ్వడంతో ఆర్‌అండ్‌బీ ఏఈ జగన్మోహన్‌రాజును ప్రశ్నించారు. వెంటనే రోడ్డు ఫొటోలు, మ్యాప్‌ను సాయంత్రంలోగా అందజేయాలని ఆదేశించారు. కాట్రగడలోని పొలాల్లో వర్షపు నీరు నీల్వ ఉండిపోవడం వల్ల పంటలు నష్టపోతున్నామని రైతులు ఆమెకు తెలియజేశారు. దీనిపై ఏపీవో తులసీదాస్‌ను జేసీ ప్రశ్నించారు. తక్షణమే నీటిని తొలగించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రజలు, రైతులు సమస్యలు పట్టించుకోవాలని ఎంపీడీవో చంద్రశేఖర్‌కు సూచించారు. ఆమె వెంట ఆర్డీవో వీవీ రమణ, తహసీల్దార్‌ ఉమామహేశ్వరరావు, మైనింగ్‌ అధికారి కుమారస్వామి, సిబ్బంది పాల్గొన్నారు.

ఇండస్ర్టీయల్‌ పార్క్‌ స్థలం పరిశీలన

సీతంపేట రూరల్‌ : పాత పనుకువలస సమీపంలో ఉన్న ఇండస్ర్టీయల్‌ పార్క్‌ స్థలాన్ని జేసీ శోభిక పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ-పంట నమోదు వేగవంతం చేయాలని రెవెన్యు సిబ్బందిని ఆదేశించారు. అనంతరం వరినాట్లు పరిశీలించారు. తహసీల్దార్‌ అప్పలరాజు, ఏవో శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2024 | 11:26 PM

Advertising
Advertising
<