ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బైండోవర్‌ అంటే తెలుసా?

ABN, Publish Date - Apr 20 , 2024 | 12:21 AM

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్‌ దగ్గర పడింది. మే 13న పోలింగ్‌ జరగనుంది. కొద్ది కాలంగా జిల్లా వ్యాప్తంగా ఎలాం టి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీ సులు భద్రతా చర్యలు చేపట్టారు.

కొమరాడ/శృంగవరపుకోట: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్‌ దగ్గర పడింది. మే 13న పోలింగ్‌ జరగనుంది. కొద్ది కాలంగా జిల్లా వ్యాప్తంగా ఎలాం టి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీ సులు భద్రతా చర్యలు చేపట్టారు. ఎన్నికలు వచ్చా యంటే శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు అధిక ప్రాధాన్యమిస్తారు. వీటికి విఘా తం కలిగించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచుతారు. గొడవలు సృష్టించేవారు... రౌడీషీటర్లు... బెల్ట్‌ దు కాణాలు నిర్వహించేవారు... నాటు సారా విక్రయిం చేవారు... ఇలా ప్రతి ఒక్కరిపై నిఘా ఉంటుంది. అలాంటి వారికి ముందస్తుగా పోలీసులు హెచ్చరి కలు జారీ చేస్తుంటారు. ఎన్నికల సమయంలో ప్ర త్యేకంగా బైండోవర్‌ కేసులు నమోదు చేస్తుంటారు. బైండోవర్‌ అంటే (బాండ్‌ ఫర్‌ గుడ్‌ బిహేవి యర్‌) అని అర్ధం. ఎనికల వేళ ఫలానా వ్యక్తుల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని భావిస్తే... అతని చర్యలు అనుమానాస్పదంగా ఉ న్నాయని తెలిస్తే... పోలీసులు బైండోవర్‌ చేస్తారు. అలాంటి వ్యక్తులను తహసీల్దార్‌ లేదా ఆర్డీఓ ఎదుట హాజరు పరుస్తారు. చట్ట వ్యతిరేక పనులు చేయబోనని అతనిపై బాండ్‌ పేపర్‌ మీద లిఖిత పూర్వకంగా హామీ తీసుకుంటారు. సంబంధిత తహసీల్దార్‌ వారికి బైండోవర్‌ ప్రొసీడింగ్స్‌ జారీ చేస్తారు. సొంత పూచికత్తులపై ఆదేరోజు విడుదల చేస్తారు. అలా బైండోవర్‌ అయిన వ్యక్తి ఆ రోజు నుంచి ఏడాది వరకు ఎలాంటి నేరాలకు పాల్పడ కూడదు. అలా పాల్పడతే లిఖిత పూర్వకంగా ఇచ్చి న బాండ్‌లో ఎంత మొత్తం నమోదు చేసి ఉంటా రో... అంత మొత్తం పెనాల్టీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లించకపోయినా నేరం కిందనే పరిగణిస్తారు. ఐపీసీ సెక్షన్లు 106, 107, 108, 110 కింద రెండు, అంతకన్నా ఎక్కువసార్లు బైండోవర్‌ అయితే అతనిపై రౌడీషీట్‌ నమోదు చేసే అవకా శం ఉంటుంది. ఎన్నికల వేళ గుంపులు గుంపులు గా వెళ్లి గొడవలు పడటం... శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వంటి చర్యలకు పాల్పడకూ డదు. ఎవరైనా పౌరులు తమపై అక్రమంగా పోలీ సులు బైండోవర్‌ పెట్టారని భావిస్తే హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసుకోవచ్చు. కోర్టు పోలీసులకు నోటీసులు జారీ చేసి... రెండు వర్గాల వాదనలు విన్న తర్వాత కేసుపై నిర్ణయం తీసుకుంటుంది.

Updated Date - Apr 20 , 2024 | 12:21 AM

Advertising
Advertising