గిరిజనుల వేదన పట్టదా?
ABN, Publish Date - May 23 , 2024 | 11:20 PM
రహదారి సౌకర్యం లేక నయా గ్రామ పంచాయతీ గ్రామస్థులు ఇబ్బం దులు ఎదుర్కొంటు న్నారు.
-రహదారి సౌకర్యం లేక నయా గ్రామస్థుల ఇక్కట్లు
(కొమరాడ)
రహదారి సౌకర్యం లేక నయా గ్రామ పంచాయతీ గ్రామస్థులు ఇబ్బం దులు ఎదుర్కొంటు న్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో పలు గ్రామాలకు గ్రావెల్ రహదారులు వేశారు. వీటిని తారు రోడ్లగా నిర్మించే సమయానికి టీడీపీ అధికారం కోల్పోయి వైసీపీ పగ్గాలు చేపట్టింది. అయితే ఐదేళ్ల వైసీపీ పాలనలో రహదారులపై తారు పోసుకోలేదు. దీంతో గిరిజనులకు ఇబ్బం దులు తప్పడం లేదు. అధికారం చేపట్టి ఐదేళ్లు పూర్తయినా వైసీపీ దృష్టికి గిరిజన గ్రామాల రహదారులు రాకపోవడం, వారి కష్టాలు కనిపించకపోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఒక్క నయా పంచాయతీయే కాకుండా పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న ఎనిమిది సబ్‌ప్లాన్ మండలాల్లోని అనేక గిరి శిఖర గ్రామాలకు ఇప్పటికీ పక్కా రహదారి లేదు. ఈ గ్రామాల్లో ఎవరైనా అనారోగ్యం బారినపడితే ఇక్కడకు 108, 104 వాహనాలు రావు. దీంతో గిరిజనులు డోలీ మోతతో రోగులను మైదాన ప్రాంతానికి తీసుకువచ్చి అక్కడ నుంచి ఆటోలు, ఇతర వాహనాల్లో సమీప వైద్యశాలలకు తీసుకువెళ్లాల్సి వస్తోంది. వైసీపీ పాలన లో జిల్లాకు చెందిన వ్యక్తే గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా పని చేశారు. అయినా ఈ జిల్లాలో గిరిజనులకు సరైన రహదారి, తాగునీ టి వసతులు కల్పించలేకపోయారని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ‘నా ఎస్టీలు’ అని సమయం దొరికినప్పుడల్లా సభల్లో ప్రసంగాలు ఊదరగొడుతున్న వైసీపీ నాయకులకు గిరిజనులు కష్టాలు క నిపించకపోవడం విచారకరమని చిన ఖేర్జిల మాజీ ఎంపీటీసీ సభ్యురాలు లావణ్య లత అన్నారు.
Updated Date - May 23 , 2024 | 11:20 PM