రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు
ABN, Publish Date - Aug 24 , 2024 | 11:27 PM
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
పార్వతీపురం, ఆగస్టు24(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. కృష్ణాష్టమి సందర్భంగా ఈ నెల 26న గ్రీవెన్స్‌ను నిర్వహించడం లేదన్నారు. ఈ విషయాన్ని జిల్లావాసులు గమనించాలన్నారు.
నేడు లఖ్‌పతిదీది
జిల్లాలో స్వయం సహాయక సంఘాల సభ్యుల కోసం ఆదివారం లఖ్‌పతి దీదీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. మహారాష్ట్రలోని జలగాన్ గ్రామంలో పీఎం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, అన్ని మండల సమాఖ్య కార్యాలయాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని, మహిళలు, ప్రజా ప్రతినిధులు పాల్గొనేలా చూడాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు. జిల్లాలో 5,212 మంది సభ్యులకు రూ.56.64 కోట్లు బ్యాంకు లింకేజీగా, 124 మంది సభ్యులకు సీఐఎఫ్ కింద రూ.60 లక్షలు, పీఎం ఉపాధి కల్పన కింద 117 మందికి రూ.8.90 కోట్లు అందించనున్నట్లు తెలిపారు.
గ్రామసభలు విజయవంతం
జిల్లాలో నిర్వహించిన గ్రామసభలు విజయవంతమైనట్లు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. సర్పంచ్‌ల అధ్యక్షతన శుక్రవారం 451 పంచాయతీల్లో దిగ్విజయంగా గ్రామ సభలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రతి పంచాయతీ నుంచి సుమారు 50 నుంచి 150 వరకు వివిధ పనులకు ప్రతిపాదనలు తయారు చేయనున్నట్లు చెప్పారు.
Updated Date - Aug 24 , 2024 | 11:27 PM