తప్పిన పెను ప్రమాదం
ABN, Publish Date - Jul 15 , 2024 | 12:14 AM
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గుమ్మ లక్ష్మీపురం గ్రామంలోని గ్రామీణ బ్యాంకు వీధిలో ఉన్న తంగుడు ఫకీరునాయు డు, గుంట్రెడ్డి విమలరాణికి చెందిన రెండు ఇళ్లు నేలమట్టమయ్యాయి.
గుమ్మలక్ష్మీపురం: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గుమ్మ లక్ష్మీపురం గ్రామంలోని గ్రామీణ బ్యాంకు వీధిలో ఉన్న తంగుడు ఫకీరునాయు డు, గుంట్రెడ్డి విమలరాణికి చెందిన రెండు ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ ఘటన ఆదివారం ఉదయం ఆరు గంటల సమయంలో జరిగింది. భారీ వర్షాల కారణంగా విమలారాణి ఇళ్లు పైభాగం ఒక్కసారిగా కూలి ఫకీరునాయుడు ఇంటిపైన పడింది. ఇది గమనించిన ఫకీరునాయుడు కుటుంబ సభ్యులు ఒక్క సారిగా అ ప్రమత్తమై భయంతో ఇంటి లోపల నుంచి బయటకు పరుగులు తీశారు. చిన్నారులు నిద్రిస్తున్న గదిలోనే పైభాగం సగం వరకు వచ్చి కూలింది. నిమిషం పాటులో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సుమారు రూ.3 లక్షలు ఆస్తి నష్టం ఉంటుందని భావిస్తున్నారు. ఇదే కాకుండా కూలిన ఇంటిపక్కనే రేకులషెడ్‌లో ఉన్న కారుకు కూడా చిన్నపాటి ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ బొత్తాడ గౌరీశంకర్‌రావు, పంచాయతీ కార్యదర్శి కిషోర్‌కుమార్ సంఘటనా సలానికి వచ్చి పరిశీలించి బాధితులను పరామర్శించారు.
Updated Date - Jul 15 , 2024 | 12:14 AM