ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఎన్నికలను బహిష్కరిస్తున్నాం

ABN, Publish Date - Apr 19 , 2024 | 12:40 AM

సింహాద్రి ఎన్టీపీసీ కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఇదే అంశాన్ని పాలకులు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోకపోవడంతో వచ్చే సార్వత్రిక ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు మూలస్వయంభూవరం గ్రామస్థులు స్పష్టం చేశారు.

డీఆర్‌వో దయానిధికి తీర్మాన పత్రాన్ని అందజేస్తున్న మూలస్వయంభూవరం గ్రామస్థులు

డీఆర్‌ఓకు తీర్మానం పత్రాన్ని అందజేసిన

మూలస్వయంభూవరం గ్రామస్థులు

పరవాడ, ఏప్రిల్‌ 18: సింహాద్రి ఎన్టీపీసీ కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఇదే అంశాన్ని పాలకులు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోకపోవడంతో వచ్చే సార్వత్రిక ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు మూలస్వయంభూవరం గ్రామస్థులు స్పష్టం చేశారు. ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు గ్రామస్థుల సంతకాలతో కూడిన తీర్మాన పత్రాన్ని గురువారం డీఆర్‌ఓ దయానిధికి అందజేశారు. సింహాద్రి కాలుష్యంతో తరచూ అనారోగ్యాలకు గురవుతున్నామని పేర్కొన్నారు. అధికారులు, పాలకులు తమ గోడును పట్టించుకోకపోవడంతో వారి తీరును నిరసిస్తూ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. గ్రామాన్ని సురక్షిత ప్రాంతాన్ని తరలించే వరకు ఏ ఎన్నికల్లోనూ కూడా పాల్గొనబోమని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి బాబూరావు, మరిసా అప్పారావు, బొండా కనకరాజు, మరిసా రవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 12:40 AM

Advertising
Advertising