ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కొత్త కలెక్టర్‌గా విజయకృష్ణన్‌

ABN, Publish Date - Jul 03 , 2024 | 12:28 AM

అనకాపల్లి కలెక్టర్‌గా విజయకృష్ణన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆమెను అనకాపల్లి జిల్లా కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టిని బదిలీ చేస్తూ, ఇంకా ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు.

కొత్త కలెక్టర్‌ విజయకృష్ణన్‌

- ప్రస్తుత కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టికి బదిలీ

అనకాపల్లి, జూలై 2 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి కలెక్టర్‌గా విజయకృష్ణన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆమెను అనకాపల్లి జిల్లా కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టిని బదిలీ చేస్తూ, ఇంకా ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు.

తమిళనాడుకు చెందిన విజయకృష్ణన్‌ 2013 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. 2022లో కొత్తగా ఏర్పడిన బాపట్ల జిల్లాకు కలెక్టర్‌గా నియమితులై 2023 ఏప్రిల్‌ 13వ తేదీ వరకు పనిచేశారు. తరువాత సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆమెను అనకాపల్లి జిల్లా కలెక్టర్‌గా నియమించింది. ఆమె అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ సతీమణి. కాగా ఆమె రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు.

పాలనలో రవి పట్టన్‌శెట్టి ప్రత్యేక ముద్ర

జిల్లాల పునర్విభజన తరువాత ఏర్పడిన అనకాపల్లి జిల్లా కలెక్టర్‌గా రవి పట్టన్‌శెట్టి పరిపాలనలో తనదైన ముద్ర వేసుకున్నారు. కలెక్టరేట్‌తో సహా వివిధ ప్రభుత్వ శాఖలకు సొంత భవనాలు లేని జిల్లాలో ఆయన పనిచేసిన కాలంలో పరిపాలనలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రజలకు సేవలందించేందుకు కృషి చేశారు. 2022 ఏప్రిల్‌ 4న అనకాపల్లి జిల్లా కలెక్టర్‌గా రవి పట్టన్‌శెట్టి వైద్య, ఆరోగ్యశాఖ కమిషనరేట్‌ నుంచి బదిలీపై వచ్చారు. రెండేళ్లకుపైగా పనిచేసిన ఆయన పరిపాలనలో తనదైన ముద్ర వేసుకున్నారు. వివాదాలకు దూరంగా ఉంటూ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పనిచేస్తారని గుర్తింపు తెచ్చుకున్నారు. కలెక్టరేట్‌కు కొత్త భవనంలో అన్ని శాఖలకు నెల రోజుల్లోనే వసతులు కల్పించి ఈ-ఆఫీసింగ్‌ సేవలను అందుబాటులోకి తేవడంలో ఎంతో కృషి చేశారు. కొత్తగా ఏర్పడిన జిల్లాకు ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ భవన సముదాయం నిర్మాణాల కోసం స్థల సేకరణ పూర్తిచేసి, కేంద్రప్రభుత్వానికి డీపీఆర్‌ సమర్పించారు.

ప్రధానమంత్రి చేతుల మీదుగా అవార్డు

వైద్య, ఆరోగ్యశాఖలో సమూల మార్పులపై కలెక్టర్‌గా రవి పట్టన్‌శెట్టి క్షేత్రస్థాయిలో స్టడీ చేసి 2023లో రాష్ట్రం నుంచి న్యూఢిల్లీలో స్వస్థ్‌ భారత్‌ (హెల్త్‌ భారత్‌)విభాగంలో హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్లను సమర్థంగా నిర్వహించేందుకు అవసరమైన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చేందుకు రాష్ట్రం నుంచి రవి పట్టన్‌శెట్టి ఒక్కరే ఎన్నికయ్యారు. క్షేత్రస్థాయిలో వైద్య రంగంలో ఎటువంటి మార్పులు చేస్తే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయన్న అంశంపై రవి పట్టన్‌శెట్టి ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌కు పీఎం నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. ప్రైమినిస్టర్స్‌ అవార్డు ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ అవార్డు ( పీఎంఏఈఏపీ అవార్డు-2022) ను ప్రతిష్ఠాత్మకమైన పీఎం ప్రశంసా పత్రాన్ని గత ఏడాది న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అందుకున్నారు.

a

2ఏకేపీ.5. కొత్త కలెక్టర్‌ విజయకృష్ణన్‌

Updated Date - Jul 03 , 2024 | 12:28 AM

Advertising
Advertising