ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మద్యం బాటిళ్లు తరలిస్తూ పట్టుబడిన వైస్‌షాప్‌ సూపర్‌వైజర్‌

ABN, Publish Date - Apr 17 , 2024 | 11:48 PM

పట్టణంలోని ఓ ప్రభుత్వ మద్యం షాపులో సూపర్‌వైజర్‌ బుధవారం ఉదయం ఎటువంటి అనుమతుల్లేకుండా మద్యం బాటిళ్లు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలు

పాయకరావుపేట, ఏప్రిల్‌ 17 : పట్టణంలోని ఓ ప్రభుత్వ మద్యం షాపులో సూపర్‌వైజర్‌ బుధవారం ఉదయం ఎటువంటి అనుమతుల్లేకుండా మద్యం బాటిళ్లు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

మందుగా అందిన సమాచారం మేరకు బుధవారం ఉదయం పట్టణ శివారులో ఎస్‌ఐ జోగారావు, సిబ్బంది వాహన తనిఖీలు చేస్తున్నారు. ఆ సమయంలో పట్టణంలోని ఓ ప్రభుత్వ వైన్‌షాపు సూపర్‌వైజర్‌ కోనేటి నాగవెంకటపద్మారావు ఎటువంటి అనుమతుల్లేకుండా ప్లాస్టిక్‌ కవర్‌లో ఆరు మద్యం బాటిళ్లను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దీనిపై ఎస్‌ఐ జోగారావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయమై ఎస్‌ఈబీ ఇన్‌స్పెక్టర్‌ ధర్మారావుని వివరణ కోరగా.. పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా నివేదిక తయారు చేసి జిల్లా ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

Updated Date - Apr 17 , 2024 | 11:48 PM

Advertising
Advertising