రైల్వే పనులపై కేంద్ర మంత్రి ఆరా
ABN, Publish Date - Jul 10 , 2024 | 01:11 AM
కేంద్ర విమానయాన శాఖా మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు వాల్తేరు రైల్వే డివిజన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు.
విశాఖ, విజయనగరం ఎంపీలు ఎం.శ్రీభరత్, కలిశెట్టి అప్పలనాయుడుతో కలిసి డీఆర్‌ఎం కార్యాలయానికి కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు
పెండింగ్ ప్రాజెక్టు పూర్తికి సహకారం అందిస్తామని హామీ
విశాఖపట్నం, జూలై 9 (ఆంధ్రజ్యోతి):
కేంద్ర విమానయాన శాఖా మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు వాల్తేరు రైల్వే డివిజన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. విశాఖపట్నం ఎంపీ ఎం.శ్రీభరత్, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడులతో కలిసి ఆయన మంగళవారం సాయంత్రం డీఆర్‌ఎం కార్యాలయానికి వెళ్లారు. డివిజన్‌లో జరుగుతున్న పనుల గురించి డీఆర్‌ఎం సౌరభ్ ప్రసాద్‌ను అడిగి తెలుసుకున్నారు. మౌలిక వసతులకు సంబంధించిన ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు, స్టేషన్ల ఆధునికీకరణ వంటి వివరాలను డీఆర్‌ఎం వివరించారు. మంత్రి రామ్మోహన్‌నాయుడు అమృత్ స్టేషన్ల పనులు, రైళ్ల స్టాపేజీలు, విస్తరణ పనులు, ప్రయాణికులకు మరింత మెరుగైన కనెక్టివిటీ, ప్రయాణికులకు కల్పిస్తున్న వసతులు వంటి అంశాలపై ప్రశ్నించి తెలుసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనులపై సంతృప్తి వ్యక్తంచేశారు. పెండింగ్ పనుల పూర్తికి సహకారం అందిస్తామని, రైల్వేస్టేషన్ల విస్తరణకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.
Updated Date - Jul 10 , 2024 | 01:11 AM