ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రహదారులు ఇలా.. వెళ్లేదెలా?

ABN, Publish Date - Jul 15 , 2024 | 12:22 AM

అడుగడుగునా గోతులు.. జిగ్‌ జాగ్‌గా వెళ్లాల్సిన పరిస్థితులు.. మండలంలోని తాండవ- నాతవరం రహదారిలో ప్రయాణించే వాహనచోదకులకు తప్పని అవస్థలు. ఈ రహదారి అధ్వానంగా ఉన్నా గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. అలాగే గొలుగొండ మండలంలోని పలు రహదారుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది.

అధ్వానంగా ఉన్న తాండవ రోడ్డు

అధ్వానంగా తాండవ- నాతవరం రోడ్డు

వాహనచోదకులకు తప్పని ఇబ్బందులు

నాతవరం, జూలై 14: అడుగడుగునా గోతులు.. జిగ్‌ జాగ్‌గా వెళ్లాల్సిన పరిస్థితులు.. మండలంలోని తాండవ- నాతవరం రహదారిలో ప్రయాణించే వాహనచోదకులకు తప్పని అవస్థలు. ఈ రహదారి అధ్వానంగా ఉన్నా గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. అలాగే గొలుగొండ మండలంలోని పలు రహదారుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కూటమి ప్రభుత్వ హయాంలోనైనా తమ కష్టాలు తీరతాయని వాహనచోదకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మండలంలోని తాండవ- నాతవరం రోడ్డు గోతులతో దారుణంగా ఉంది. మాధవనగరం, అడాకుల, చమ్మచింత, కురువాడ గ్రామాలతో పాటు గొలుగొండ మండలాన్ని కలిపే ఈ రహదారి ఐదేళ్లుగా గోతులతో దర్శనమిస్తోంది. వైసీపీ ఐదేళ్ల పాలనలో కనీసం మరమ్మతులు చేపట్టలేదు. వర్షాకాలంలో ఆర్టీసీ బస్సుల రాకపోకలకు ఇబ్బందిగా ఉండడంతో రెండేళ్ల క్రితం జనసేన నాయకులు సొంత ఖర్చులతో గోతులను తాత్కాలికంగా పూడ్చారు. అలాగే గత ఏడాది జనసేన, టీడీపీ నాయకులు క్రషర్‌ బూడిదతో పూడ్చారు. అయితే వర్షాలకు మళ్లీ గోతులు పడ్డాయి. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గర్భిణులు ఈ మార్గంలో ప్రయాణించేటప్పుడు నరకయాతన పడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో తమ కష్టాలు తీరతాయని పలు గ్రామాల ప్రజలు, వాహనచోదకులు ఆశాభావంతో ఉన్నారు.

గొలుగొండ మండలంలో...

కృష్ణాదేవిపేట: గొలుగొండ మండలంలోని పలు గ్రామాల్లో రహదారులు గోతులతో అధ్వానంగా ఉన్నాయి. ఏఎల్‌పురం, చోద్యం, నాగాపురం, పాతకృష్ణాదేవిపేట తదితర గ్రామాల్లో వర్షమొస్తే ఆ గోతుల్లో నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. ముఖ్యంగా పాతకృష్ణాదేవిపేట, పల్లావూరు, రామచంద్రపురం, కొంగసింగి, ఏఎల్‌పురం, లింగంపేట తదితర గ్రామాలకు వెళ్లే రోడ్డు దారుణంగా ఉంది. ఈ మార్గంలో ప్రయాణించే వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం రహదారులకు కనీసం మరమ్మతులు చేయించకపోవడంతో ఈ దుస్థితి నెలకొందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు, వాహనదారులు కోరుతున్నారు.

Updated Date - Jul 15 , 2024 | 12:22 AM

Advertising
Advertising
<