ప్రజా పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తం
ABN, Publish Date - May 26 , 2024 | 12:46 AM
ప్రజా పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. బియ్యం కార్డు లబ్ధిదారులకు ఇచ్చే నిత్యావసర సరకుల పంపిణీ ఇష్టారాజ్యంగా తయారైంది. కందిపప్పు మూడు నెలలుగా ఇవ్వడం లేదు. గోధుమ పిండి ఒక నెల ఇస్తే మరుసటి నెలలో ఇవ్వడం లేదు. ఏప్రిల్ నెలలో గోధుమ పిండి ప్యాకెట్ల సరఫరా ఆపేసి, మే నెలలో పంపిణీ చేశారు. జూన్ నెలకి గోధుమ పిండి ప్యాకెట్లు పౌర సరఫరాల గోదాములకు చేరలేదు. ఇస్తారో ఇవ్వరో తెలియదు. రెండు నెలలుగా రాగి పిండి ప్యాకెట్ల పంపిణీ పూర్తిగా ఆపేశారు.
- ప్రతి నెలా ఏ సరకులు ఇస్తారో తెలియని పరిస్థితి
- మూడు నెలలుగా నిలిచిపోయిన కందిపప్పు పంపిణీ
- వచ్చే నెలలో గోధుమ పిండి ఇవ్వనట్టే..
- ఇప్పటికీ గోదాముకి చేరని ప్యాకెట్లు
నర్సీపట్నం, మే 25 : ప్రజా పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. బియ్యం కార్డు లబ్ధిదారులకు ఇచ్చే నిత్యావసర సరకుల పంపిణీ ఇష్టారాజ్యంగా తయారైంది. కందిపప్పు మూడు నెలలుగా ఇవ్వడం లేదు. గోధుమ పిండి ఒక నెల ఇస్తే మరుసటి నెలలో ఇవ్వడం లేదు. ఏప్రిల్ నెలలో గోధుమ పిండి ప్యాకెట్ల సరఫరా ఆపేసి, మే నెలలో పంపిణీ చేశారు. జూన్ నెలకి గోధుమ పిండి ప్యాకెట్లు పౌర సరఫరాల గోదాములకు చేరలేదు. ఇస్తారో ఇవ్వరో తెలియదు. రెండు నెలలుగా రాగి పిండి ప్యాకెట్ల పంపిణీ పూర్తిగా ఆపేశారు. గొలుగొండ మండలంలో 17,441, నర్సీపట్నంలో 26,421 రేషన్ కార్డులు ఉన్నాయి. రెండు మండలాల పరిధిలో 84 చౌక దుకాణాలు ఉన్నాయి. ప్రతి నెలా ఒకటవ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఎండీయూ ఆపరేటర్ల ద్వారా ఇంటింటికి రేషన్ సరకులు పంపిణీ చేస్తారు. గతంలో బియ్యం, పంచదార, కందిపప్పు, గోధుమ పిండి, రాగి పిండి పంపిణీ చేసేవారు. గత మూడు నెలలుగా కందిపప్పు సరఫరా ఆగిపోయింది. జూన్ నెలకు సంబంధించి పంచదార, బియ్యం మాత్రమే రేషన్ డీలర్లకు చేరాయి. గోధుమ పిండి, రాగి పిండి, కందిపప్పు రాలేదు. సరకులు గోదాముకి వస్తాయో రావో తెలియదు. మే నెల నుంచి రాగి పిండి పంపిణీ ఆపేశారు. ప్రభుత్వం సక్రమంగా సరకులను పంపిణీ చేయకపోవడం వల్ల బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ ధరకు సరకులు కొనుగోలు చేయాల్సి వస్తోందని కార్డుదారులు వాపోతున్నారు.
Updated Date - May 26 , 2024 | 12:46 AM