ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందించడమే లక్ష్యం

ABN, Publish Date - Jul 05 , 2024 | 01:08 AM

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు నిరంతరం కష్టపడాలని డీఈవో వెంకటలక్ష్మమ్మ ఆదేశించారు.

ఏఎల్‌పురం హైస్కూల్‌లో విద్యార్థులను ప్రశ్నలు అడుగుతున్న డీఈవో వెంకటలక్ష్మమ్మ

డీఈవో వెంకటలక్ష్మమ్మ

కృష్ణాదేవిపేట, జూలై 4: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు నిరంతరం కష్టపడాలని డీఈవో వెంకటలక్ష్మమ్మ ఆదేశించారు. గురువారం గొలుగొండ మండలం ఏఎల్‌పురం హైస్కూల్‌ను ఆమె సందర్శించి ఉపాధ్యాయుల హాజరుపట్టిక, రికార్డులు తనిఖీలు చేశారు. అనంతరం హైస్కూల్‌లో మధ్యాహ్న భోజన మెనూ పరిశీలించారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పూర్తి స్థాయిలో అందాయా?, లేదా? అని ఆరా తీశారు. నోట్‌ పుస్తకాలను పరిశీలించి విద్యార్థులను ప్రశ్నలు వేసి సరైన సమాధానం చెప్పడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో డీఈవో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలతో మెరుగైన విద్యను అందిస్తున్నామన్నారు. ఆమె వెంట ఎంఈవో సత్యనారాయణ, స్థానిక ఇన్‌చార్జి హెచ్‌ఎం వరలక్ష్మి, ఉపాధ్యాయులు రామరాజు, టీవీ రమణ, లక్ష్మి, రామ్‌కుమార్‌, అచ్చుబాబు తదితరులు ఉన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 01:08 AM

Advertising
Advertising