ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బాబోయ్‌ ఎండలు!

ABN, Publish Date - Apr 16 , 2024 | 01:41 AM

జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపంతో జనం విలవిలలాడుతున్నారు.

జిల్లా అంతటా భానుడి ప్రతాపం

మాడుగులలో 42.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత

ఆరు మండలాల్లో తీవ్ర వడగాడ్పులు

సగం మండలాల్లో 40 డిగ్రీలకు పైబడి నమోదు

అనకాపల్లి, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపంతో జనం విలవిలలాడుతున్నారు. రెండు మూడు రోజుల నుంచి జిల్లాలో అత్యధిక మండలాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైబడి నమోదవుతున్నాయి. ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎండ చుర్రుమంటున్నది. జిల్లాలో 24 మండలాలు ఉండగా... సోమవారం ఆరు మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, తొమ్మిది మండలాల్లో వడగాడ్పులు వీశాయి. దాదాపు సగం మండలాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు మించి నమోదయ్యాయి. మాడుగుల మండలంలో అత్యధికంగా 42.7 డిగ్రీలు నమోదైంది. చీడికాడ, దేవరాపల్లి, రావికమతం మండలాల్లో 42.6 డిగ్రీలు, రోలుగుంటలో 41.8, గొలుగొండలో 41.6, కోటవురట్లలో 40.8, నాతవరంలో 40.7, కె.కోటపాడులో 40.6, కశింకోట, మాకవరపాలెం, నర్సీపట్నంలో 40.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లా కేంద్ర అనకాపల్లిలో 39.1, చోడవరం 39.9, సబ్బవరం 39.7, బుచ్చెయ్యపేట 39.5 డిగ్రీలు, అత్యల్పంగా రాంబిల్లి మండలంలో 35.7 డిగ్రీలు నమోదయ్యాయి. ఎండల తీవ్రత పెరుగుతుండడంతో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. దీంతో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి.

Updated Date - Apr 16 , 2024 | 01:41 AM

Advertising
Advertising