ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి

ABN, Publish Date - Aug 21 , 2024 | 12:47 AM

విద్యార్థులు గంజాయి, మత్తు పదార్థాల వంటి వాటికి దూరంగా ఉండాలని జిల్లా ఎస్‌పీ అమిత్‌బర్దార్‌ సూచించారు.

పాలిటెక్నిక్‌ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్న ఎస్‌పీ అమిత్‌బర్దార్‌

విద్యార్థులు జిల్లా ఎస్‌పీ అమిత్‌బర్దార్‌ హితవు

పాడేరు, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు గంజాయి, మత్తు పదార్థాల వంటి వాటికి దూరంగా ఉండాలని జిల్లా ఎస్‌పీ అమిత్‌బర్దార్‌ సూచించారు. స్థానిక పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులతో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎట్టిపరిస్థితుల్లోనూ విద్యార్థులు మాదకద్రవ్యాల జోలికి వెళ్లవద్దని హితవు పలికారు. వాటి వినియోగం, అక్రమ రవాణా కారణంగా భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. తల్లిదండ్రుల ఆశల మేరకు మంచిగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. ఎవరైనా మాదక ద్రవ్యాలకు సంబంధించి ఎటుంటి ప్రలోభాలకు గురిచేయాలని చూసినా తమకు సమాచారం అందించాలన్నారు. గ్రామాలకు వెళ్లినపుడు గంజాయి సాగు, అక్రమ రవాణా వల్ల కలిగే నష్టాలపై తల్లిదండ్రులు, గ్రామస్థులకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే మాదక ద్రవాలకు సంబంధించిన ఎటువంటి సమాచారమైన టోల్‌ప్రీ నంబర్‌ 9381123100కు కాల్‌ చేయాలన్నారు. సమాచారం తెలిపే వ్యక్తుల పేర్లు గోప్యంగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సుజాత, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2024 | 12:47 AM

Advertising
Advertising
<