ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శభాష్‌ పోలీస్‌

ABN, Publish Date - Sep 14 , 2024 | 12:37 AM

బుచ్చెయ్యపేట మండలం కోమళ్లపూడి వద్ద బుధవారం సాయంత్రం ఆరేళ్ల బాలికను ఢీకొట్టి పరారీ కావడమే కాకుండా, ఆమె మృతికి కారకుడైన వ్యాన్‌ డ్రైవర్‌ను పోలీసులు పట్టుకున్నారు. సంఘటన జరిగిన 24 గంటల్లోనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రమాదానికి కారణమైన వాహనాన్ని సీజ్‌ చేసి, నిందితుడిని అరెస్టు చేశారు. ఈ మేరకు కొత్తకోట సీఐ కోటేశ్వరరావు శుక్రవారం విలేకరులకు వివరాలను వెల్లడించారు. ఆయన చెప్పిన సమాచారం ప్రకారం...

కోమళ్లపూడిలో బాలికను ఢీకొన్న వాహనం ఇదే. గొలుగొండ మండలం గుండుపాలలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

బాలికను ఢీకొని పరారైన వ్యాన్‌ డ్రైవర్‌ 24 గంటల్లోనే పట్టివేత

బుచ్చెయ్యపేట మండలం కోమళ్లపూడిలో 11వ తేదీ సాయంత్రం ఘటన

వ్యాన్‌తోసహా ఉడాయించిన డ్రైవర్‌

నిందితుడిని పట్టుకోవడానికి పలు బృందాలు ఏర్పాటు

రావికమతం, మాడుగుల, పాడేరు, చింతపల్లి మండలాల మీదుగా సొంతూరు చేరిక

గుండుపాల సరుగుడు తోటల్లో వ్యాన్‌ దాచిన వైనం

సాంకేతిక ఆధారాలతో గుర్తించి, పట్టుకున్న పోలీసులు

అభినందించిన జిల్లా ఎస్పీ

రావికమతం/ బుచ్చెయ్యపేట, సెప్టెంబరు13: బుచ్చెయ్యపేట మండలం కోమళ్లపూడి వద్ద బుధవారం సాయంత్రం ఆరేళ్ల బాలికను ఢీకొట్టి పరారీ కావడమే కాకుండా, ఆమె మృతికి కారకుడైన వ్యాన్‌ డ్రైవర్‌ను పోలీసులు పట్టుకున్నారు. సంఘటన జరిగిన 24 గంటల్లోనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రమాదానికి కారణమైన వాహనాన్ని సీజ్‌ చేసి, నిందితుడిని అరెస్టు చేశారు. ఈ మేరకు కొత్తకోట సీఐ కోటేశ్వరరావు శుక్రవారం విలేకరులకు వివరాలను వెల్లడించారు. ఆయన చెప్పిన సమాచారం ప్రకారం...

గొలుగొండ మండలం గుండపాల గ్రామానికి చెందిన మర్రా రెడ్డిమయ్య టాటా ఏస్‌ వాహనంపై సరకులు రవాణా చేస్తుంటాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం నర్సీపట్నం నుంచి చోడవరానికి ఎరువులు తీసుకువెళ్లాడు. తిరుగు ప్రయాణంలో బుచ్చెయ్యపేట మండలం కోమళ్లపూడి వద్ద రోడ్డు దాటుతున్న గొన్నా మహాలక్ష్మినాయుడు కుమార్తె షర్మిల దుర్గ(6)ను బలంగా ఢీకొన్నాడు. దీంతో బాలిక తీవ్రంగా గాయపడింది. వాహనాన్ని ఆపితే స్థానికులు కొడతారేమోనన్న భయంతో వ్యాన్‌తో సహా పరారయ్యాడు. గాయపడిన బాలికను ఆమె తండ్రి వెంటనే రావికమతం ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కానీ పాప అప్పటికే మృతిచెందింది. అనంతరం ఈ సంఘటనపై బుచ్చెయ్యపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలిక మృతికి కారణమైన వాహనాన్ని, నిందితుడిని పట్టుకునేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కొత్తకోట సీఐ ఆధ్వర్యంలో రావికమతం, కొత్తకోట, రోలుగుంట, బుచ్చెయ్యపేట ఎస్‌ఐలతోపాటు జిల్లా పోలీసు కార్యాలయం నుంచి వచ్చిన సాంకేతిక బృందం బుధవారం రాత్రే రంగంలోకి దిగాయి. కోమళ్లపూడిలో బాలికను ఢీకొన్న వాహనం వివరాలను ప్రత్యక్ష సాక్షుల నుంచి సేకరించి, ప్రమాదం జరిగిన సమయాన్ని పరిగణనలోకి తీసుకున్న పోలీసులు, పలుమార్గాల్లో సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. సాంకేతిక ఆధారాలతో ప్రమాదానికి కారణమైన వాహనం గొలుగొండ మండలం గుండపాలలో వున్నట్టు గురువారం సాయంత్రానికి గుర్తించారు. పోలీసులు అక్కడకు వెళ్లి సరుగుడు తోటల్లో వుంచిన టాటా ఏస్‌ వాహనాన్ని స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌ మర్రా రెడ్డిమయ్యను అదుపులోకి తీసుకున్నారు. కోమళ్లపూడి వద్ద బాలికను ఢీకొట్టిన తరువాత డ్రైవర్‌ నర్సీపట్నం వెళ్లకుండా, మధ్యలో రావికమతం మండలం చినపాచిల, మాడుగుల మండలం వమ్మలి, ఘాటీరోడ్డు మీదుగా పాడేరు వెళ్లాడని, అక్కడి నుంచి చింతపల్లి మండలం లోతుగెడ్డ మీదుగా సొంతూరు గొలుగొండ మండలం గుండుపాల చేరుకుని, వాహనాన్ని సరుగుడు తోటలో దాచిపెట్టాడని సీఐ కోటేశ్వరరావు వివరించారు. ఆయా మార్గాల్లో పలుచోట్ల వున్న సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా ప్రమాదం జరిగిన 24 గంటల్లోనే వాహనంతోసహా నిందితుడిని పట్టుకున్నామని చెప్పారు. ఈ కేసును 24 గంటల్లో ఛేదించినందుకు తనతోపాటు ఎస్‌ఐలు, పోలీసు సిబ్బందిని ఎస్పీ దీపిక అభినందించారని ఆయన తెలిపారు.

Updated Date - Sep 14 , 2024 | 12:37 AM

Advertising
Advertising