ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మహిళల భద్రతకు పెద్దపీట

ABN, Publish Date - Jun 17 , 2024 | 01:07 AM

మహిళల భద్రతకు పెద్దపీట వేస్తామని రాష్ట్ర హోం శాఖా మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. స్థానిక ఎస్‌.ఆర్‌.శంకరన్‌ సమావేశ మందిరంలో ఆదివారం జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన పరిచయ వేదిక కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. పరస్పర సహకారంతో అందరం కలిసి పని చేద్దామని, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తే ఉపేక్షించేది లేదని ఆమె స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లాగా ఏర్పడిన తరువాత భవనాలు లేక ఉద్యోగులు ఇబ్బందులు పడుతూ పని చేశారన్నారు. నిబంధనల ప్రకారం పనులు చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించవద్దని సూచించారు.

సమావేశంలో మాట్లాడుతున్న హోం శాఖా మంత్రి అనిత

పరస్పర సహకారంతో పనిచేద్దాం

- ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తే ఉపేక్షించేది లేదు

- అధికారులతో హోం శాఖా మంత్రి అనిత

అనకాపల్లిటౌన్‌, జూన్‌ 16: మహిళల భద్రతకు పెద్దపీట వేస్తామని రాష్ట్ర హోం శాఖా మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. స్థానిక ఎస్‌.ఆర్‌.శంకరన్‌ సమావేశ మందిరంలో ఆదివారం జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన పరిచయ వేదిక కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. పరస్పర సహకారంతో అందరం కలిసి పని చేద్దామని, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తే ఉపేక్షించేది లేదని ఆమె స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లాగా ఏర్పడిన తరువాత భవనాలు లేక ఉద్యోగులు ఇబ్బందులు పడుతూ పని చేశారన్నారు. నిబంధనల ప్రకారం పనులు చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించవద్దని సూచించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ఎన్నో సమస్యలు తన దృష్టికి వచ్చాయని, వాటన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఇరిగేషన్‌ పనులు జరగక నీరంతా సముద్రంలో కలిసిపోతుందన్నారు. గ్రోయిన్లు లేకపోవడం, దెబ్బతినడం వల్ల వ్యవసాయానికి సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎక్కడ గంజాయి దొరికినా ఉమ్మడి విశాఖ జిల్లా వైపే అందరూ వేలెత్తి చూపిస్తున్నారని తెలిపారు. గంజాయి రవాణా అరికట్టేందుకు పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తామన్నారు. హోం మంత్రిగా నియమితులైన వెంటనే మహిళల అదృశ్యంపై చాలా మంది ఫోన్లు చేయడంతో పాటు మెసేజ్‌లు చేశారన్నారు. వీటిపై కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. సోషల్‌ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలపై చర్యలు తీసుకోవడానికి ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ఆలోచన చేస్తామన్నారు. సోషల్‌ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను నియంత్రించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ శాఖల అధికారులను కలెక్టర్‌.. మంత్రి అనితకు పరిచయం చేశారు. అలాగే పోలీసు అధికారులను ఎస్పీ కేవీ మురళీకృష్ణ పరిచయం చేయడంతో అఽధికారులంతా మంత్రిని కలిసి శుభాకాంక్షలు చెప్పారు. మంత్రి అనితను కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి ఘనంగా సత్కరించి నూకాంబిక అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.

అనిత నివాసం వద్ద కోలాహలం

నక్కపల్లి: రాష్ట్ర హోం శాఖా మంత్రి అనిత నివాసం ఆదివారం సందడిగా కనిపించింది. ఉదయం 10 గంటల వరకు ఆమె నక్కపల్లికి సమీపంలో తన నివాసం వద్ద అందుబాటులో ఉండడంతో ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు పోలీస్‌ సిబ్బంది నుంచి గౌరవ వందనాన్ని ఆమె స్వీకరించారు. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన వేద పండి తుల బృందం ఆమెకు వేద ఆశీర్వచనం చేశారు. అంగన్‌వాడీ అసోసియేషన్‌ సంఘ స్థానిక ప్రతినిధులు దుర్గారాణి, సుబ్బలక్ష్మి, రమణమ్మ తదితరులు ఆమెకు శ్రీవారి చిత్రపటాన్ని బహూకరించారు.

Updated Date - Jun 17 , 2024 | 01:07 AM

Advertising
Advertising