తగ్గిన ఖరీఫ్ సాగు
ABN, Publish Date - Aug 24 , 2024 | 01:19 AM
జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సాగు విస్తీర్ణం కాస్త తగ్గుముఖం పట్టింది. ఖరీఫ్ సాగుకు అనుకూలంగా వర్షాలు కురవకపోవడమే ఇందుకు కారణమని వ్యవసాయాధికారులు అంటున్నారు. వాస్తవానికి ఆగస్టు మూడో వారానికి ఖరీఫ్‌లో ప్రధాన పంటలైన వరి, రాగులు శతశాతం నాట్లు పడతాయి. కానీ అందుకు భిన్నంగా ఈ ఏడాది వరి 77, రాగులు 78 శాతం మాత్రమే నాట్లు వేశారు. ఇక ఖరీఫ్‌లో సాగయ్యే ఇతర పంటల పరిస్థితిలోనూ పెద్దగా మార్పులేదు.
- వర్షాలు అనుకూలించకపోవడమే కారణం
- సాగునీటి వనరుల లేమి... వర్షాధారంగానే పంటల సాగు
- ఇప్పటికి వరి నాట్లు 77 శాతం, రాగులు 78 శాతం మాత్రమే
(పాడేరు-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సాగు విస్తీర్ణం కాస్త తగ్గుముఖం పట్టింది. ఖరీఫ్ సాగుకు అనుకూలంగా వర్షాలు కురవకపోవడమే ఇందుకు కారణమని వ్యవసాయాధికారులు అంటున్నారు. వాస్తవానికి ఆగస్టు మూడో వారానికి ఖరీఫ్‌లో ప్రధాన పంటలైన వరి, రాగులు శతశాతం నాట్లు పడతాయి. కానీ అందుకు భిన్నంగా ఈ ఏడాది వరి 77, రాగులు 78 శాతం మాత్రమే నాట్లు వేశారు. ఇక ఖరీఫ్‌లో సాగయ్యే ఇతర పంటల పరిస్థితిలోనూ పెద్దగా మార్పులేదు.
జిల్లాలో గిరిజన రైతులకు ఉపయోగపడేలా సాగునీటి వనరులు అందుబాటులో లేవు. దీంతో ఖరీఫ్ సీజన్‌లో సాగుకు అనుకూలంగా వర్షాలు కురిస్తేనే పంటలు బాగుండే పరిస్థితి కొనసాగుతున్నది. అదే సాగునీటి వనరులు అందుబాటులో ఉంటే ఎటువంటి వర్షాలు కురిసినా, వాటి ఆధారంగా నీటిని నిల్వ చేసుకుని పంటల సాగును చేపట్టేందుకు అవకాశం ఉంటుందని రైతులు అంటున్నారు. గత పదేళ్లుగా కొత్త చెక్‌డ్యామ్‌లు నిర్మించకపోగా, గత ఐదేళ్లుగా ఉన్న కొద్దిపాటి చెక్‌డ్యామ్‌లకు కనీస మరమ్మతులు చేపట్టని పరిస్థితి ఉంది. దీంతో సమృద్ధిగా వర్షాలు కురిసినా ఆ నీటిని ఒడిసిపట్టే అవకాశం లేకుండా పోయింది. అలాగే వర్షాలు సైతం పంటల సాగుకు ఏమాత్రం అనుకూలంగా కురవడం లేదు. పంటల సాగుకు అవసరమైనప్పుడు వర్షాలు కురవకపోవడం, వర్షాలు పడకూడదనుకునే సమయంలో అతివృష్టిగా కురిశాయి. ఈ ఏడాది జూన్, జూలై, ఆగస్టు నెలల్లో కురిసిన వర్షాలు ఖరీఫ్ పంటలకు ఆశాజనకంగా లేవు. దీంతో ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం కాస్త తగ్గింది. వాస్తవానికి సాగునీటి వనరులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటే ఖరీఫ్, రబీ సీజన్లలోనూ అధిక విస్తీర్ణంలో పంటలు సాగయ్యే అవకాశముందని గిరిజన రైతులు అంటున్నారు.
చింతూరు డివిజన్ పరిధిలో వరదలతో ఇబ్బంది
జిల్లాలో పాడేరు డివిజన్ పరిధిలో ఖరీఫ్ పంటలకు ఒక మోస్తరుగా ఢోకా లేనప్పటికీ, చింతూరు డివిజన్ పరిధిలో జూలై నెలలో సంభవించిన వరదలతో ఖరీఫ్ పంటలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలోని పొగాకు, నువ్వులు వంటి పంటల సాగు చేపట్టలేని పరిస్థితి ఏర్పడింది. అలాగే రంపచోడవరం డివిజన్‌లోనూ దాదాపుగా ఇదే పరిస్థితి ఏర్పడింది.
జిల్లాలో ఖరీఫ్‌లో పంటల సాగు వివరాలు(హెక్టార్లలో)....
వ.సం పంట పేరు సాధారణ విస్తీర్ణం సాగు విస్తీర్ణం శాతం
1. వరి 56,792 43,482 77
2. రాగులు 16,376 12,771 78
3. సామ 3,019 1,667 55
4. మొక్కజొన్న 3,917 1,068 27
5. కొర్ర 129 113 88
6. జొన్న 121 51 42
7. కంది 821 154 19
8. పెసర 162 3 2
9. మినుము 821 49 6
10. వేరుశెనగ 1696 1,262 74
11. నువ్వులు 43 0 0
12. పొగాకు 200 0 0
Updated Date - Aug 24 , 2024 | 01:19 AM