మినుములూరు సర్పంచ్‌కు అరుదైన అవకాశం
ABN, Publish Date - Aug 10 , 2024 | 10:59 PM
మండలంలో మినుములూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ లంకెల చిట్టెమ్మకు దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఏడాది జరిగే స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనే అరుదైన అవకాశం దక్కింది.
దేశ రాజధానిలో స్వాతంత్య్ర వేడుకలకు ఆహ్వానం
పాడేరు, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): మండలంలో మినుములూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ లంకెల చిట్టెమ్మకు దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఏడాది జరిగే స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనే అరుదైన అవకాశం దక్కింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో వివిధ కేటగిరిల్లో ఉత్తమ సేవలు అందిస్తున్న ఐదుగురు మహిళా ప్రజాప్రతినిధులకు దేశ రాజధానిలో జరిగే స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించారు. వారిలో గుంటూరు జడ్పీ చైర్‌పర్సన్ కె.హానీ క్రిస్టీనా, పశ్చిమగోదావరి జిల్లా వీరంవసరం ఎంపీపీ వీరవల్లి దుర్గా భవానీ, అల్లూరి సీతారామరాజు జిల్లా మినుములూరు సర్పంచ్ లంకెల చిట్టమ్మ, కృష్ణా జిల్లా చల్లపల్లి సర్పంచ్ పి.కృష్ణకుమారి, అనంతపురం జిల్లా జి.కల్యాణదుర్గం సర్పంచ్ బి.కవిత ఉన్నారు. అయితే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మినుములూరుకు చెందిన గిరిజన మహిళాసర్పంచ్ చిట్టమ్మకు అరుదైన అవకాశం దక్కడంపై గిరిజన సర్పంచులు, మన్య వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Aug 10 , 2024 | 10:59 PM