బారులు తీరిన ‘నిరుద్యోగం’
ABN, Publish Date - Aug 13 , 2024 | 12:09 AM
ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించే డీఎస్‌సీ ఉచిత కోచింగ్‌ను పొందేందుకు నిరుద్యోగులు విశేష ఆసక్తి చూపారు.
డీఎస్‌సీ ఉచిత కోచింగ్ దరఖాస్తుల కోసం బారులు తీరిన నిరుద్యోగులు
పాడేరు, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించే డీఎస్‌సీ ఉచిత కోచింగ్‌ను పొందేందుకు నిరుద్యోగులు విశేష ఆసక్తి చూపారు. సోమవారం నుంచి ఐటీడీఏ కార్యాలయంలో కోచింగ్ దరఖాస్తులు పంపిణీ ప్రారంభించడంతో అధిక సంఖ్యలో నిరుద్యోగులు క్యూ కట్టారు. తొలిరోజే 410 మంది అభ్యర్థులు దరఖాస్తులను పొందారు. అలాగే అభ్యర్థులు పూరించిన దరఖాస్తులను ఈనెల 17న తిరిగి ఐటీడీఏ కార్యాలయంలో సమర్పించాలని ఐటీడీఏ పీవో అభిషేక్ పేర్కొన్నారు.
Updated Date - Aug 13 , 2024 | 12:09 AM