ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్లేట్‌లెట్స్‌ డౌన్‌!

ABN, Publish Date - Aug 23 , 2024 | 01:27 AM

జ్వర బాధితుల్లో ప్లేట్‌లెట్స్‌ తగ్గుముఖం పడుతున్నాయి. సాధారణంగా డెంగ్యూ జ్వరం వస్తే ప్లేట్‌లెట్స్‌ తగ్గుతుం టాయి.

  • జ్వర బాధితుల్లో ఎదురవుతున్న సమస్య

  • వైరల్‌ హెమరాజిక్‌ ఫీవర్స్‌తో ఇబ్బందులు

  • ప్రతి నలుగురిలో ఇద్దరికి తగ్గుతున్న ప్లేట్‌లెట్స్‌

  • భయపడవద్దంటున్న వైద్యులు

విశాఖపట్నం, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి):

జ్వర బాధితుల్లో ప్లేట్‌లెట్స్‌ తగ్గుముఖం పడుతున్నాయి. సాధారణంగా డెంగ్యూ జ్వరం వస్తే ప్లేట్‌లెట్స్‌ తగ్గుతుం టాయి. కానీ ఫ్లూ జ్వరంతో బాధపడే వారికీ ప్లేట్‌లెట్స్‌ తగ్గు తుండడంతో రోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఈ తరహా కేసులు అధికంగా నమోదవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ప్లేట్‌లెట్స్‌ తగ్గినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా ప్లేట్‌లెట్‌ కౌంట్‌ 1.5 లక్షల నుంచి 4 లక్షలు వరకు ఉండాలి. ప్రస్తుతం కనిపిస్తున్న వైరల్‌ హెమరేజిక్‌ ఫీవర్స్‌ బాధితుల్లో రెండు,మూడు రోజుల్లో ఒక్కసారిగా ప్లేట్‌లెట్స్‌ 60 వేల నుంచి లక్ష వరకు పడిపోతున్నాయి. తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇవి డెంగ్యూ తరహా లక్షణాలుగా కనిపిస్తున్నప్పటికీ పరీక్షలు నిర్వహిస్తే నెగిటివ్‌ వస్తోందని వైద్యులు చెబుతున్నారు. ప్లేట్‌లెట్స్‌ తగ్గుముఖం పడుతుండడంతో డెంగ్యూగా భావించి వైద్యం అందిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతున్నారు. వాడకూడని మందులు వాడినా ప్లేట్‌లెట్స్‌ తగ్గుతాయని, ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు అవసరమని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్‌ సోమయాజులు తెలిపారు.

విజృంభిస్తున్న వైరల్‌ ఫీవర్స్‌

జిల్లాలో వైరల్‌ ఫీవర్స్‌ విజృంభిస్తున్నాయి. బాధితుల్లో జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి, తలనొప్పి, ఒళ్లు నొప్పులు కనిపిస్తున్నాయి. మూడు రోజుల తరువాత జ్వరం తగ్నిప్పటికీ ఒళ్లు నొప్పులు, తలనొప్పి వేధిస్తున్నాయి. కుటుంబంలో ఒకరికి వస్తే.. మిగిలిన వారికీ వ్యాప్తి చెందుతోందని, 70 శాతం కేసుల్లో మందులు వాడకుండానే తగ్గుతోందని వైద్యులు చెబుతున్నారు. పది నుంచి 20 శాతం కేసులకు మాత్రమే మందులు వాడాల్సి వస్తోందని, పది శాతం కేసుల్లో మాత్రమే రక్త పరీక్షలకు వెళ్లాల్సి వస్తోందని డాక్టర్‌ సోమయాజులు తెలిపారు. అతి తక్కువ కేసులను మాత్రమే ఆస్పత్రిలో అడ్మిట్‌ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోందన్నారు.

ప్లేట్‌లెట్స్‌ కోసం రోగులు

కాగా జిల్లాలో డెంగ్యూ కేసులు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఈ బాధితుల్లో ప్లేట్‌లెట్స్‌ సంఖ్య పడిపోవడంతో వారి బంధువులు బ్లడ్‌ బ్యాంకులు చుట్టూ తిరుగుతున్నాయి. నగర పరిధిలో 35 బ్లడ్‌ బ్యాంకులుండగా, ఒక్కో చోట రోజుకు కనీసం ఐదు నుంచి పది ప్లేట్‌లెట్స్‌ బ్యాగులను అందిస్తున్నారు. వారం రోజులుగా ప్లేట్‌లెట్స్‌ కోసం వస్తున్న వారి సంఖ్య పెరిగిందని వందేభారత్‌ బ్లడ్‌ బ్యాంక్‌ చైర్మన్‌ వినోద్‌బాలు తెలిపారు. రోగుల అవసరాలకు అనుగుణంగా ప్లేట్‌లెట్స్‌ ఏర్పాటుచేయడంపై దృష్టి సారించామని వివరించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు జిల్లాలో 4,218 మందికి డెంగ్యూ పరీక్షలు నిర్వహించగా, 329 మందికి పాజిటివ్‌గా తేలింది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆరోగ్యశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో వైరల్‌ ఫీవర్స్‌ ఎక్కువగా ఉన్నాయని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ జగదీశ్వరరావు తెలిపారు. క్షేత్రస్థాయిలో జ్వర పీడితులను పర్యవేక్షించేలా సిబ్బందికి ఆదేశాలిచ్చామని, మూడు రోజులకు మించి జ్వర లక్షణాలుంటే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

Updated Date - Aug 23 , 2024 | 01:27 AM

Advertising
Advertising
<