ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బటన్‌ నొక్కినా డబ్బులు పడలేదు

ABN, Publish Date - May 17 , 2024 | 12:46 AM

జిల్లాలో చేయూత పథకం నగదు విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోంది. చేయూత నిధుల విడుదలకు సీఎం జగన్‌ బటన్‌ నొక్కి రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ మహిళల ఖాతాల్లోకి డబ్బులు జమ కాలేదు. వారంతా ఆ డబ్బులు ఎప్పుడొస్తాయా? అని ఎదురు చూస్తున్నారు. రెండు నెలలుగా బ్యాంకులకు వెళ్లి ఖాతాల్లో డబ్బులు పడ్డాయా? అని ఆరా తీసిన అనేక మంది మహిళలకు నిరాశే ఎదురైంది. ఎన్నికల ముందు ఖాతాల్లో డబ్బులు వేస్తామని హడావిడి చేసిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు మిన్నకుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అనకాపల్లి మండలం పిసినికాడ గ్రామంలో చేయూత నిధులు విడుదల సందర్భంగా బటన్‌ నొక్కుతున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి(ఫైల్‌ ఫొటో)

- రెండు నెలలుగా చేయూత లబ్ధిదారుల ఎదురుచూపులు

- ఎన్నికల ముందు హడావిడి చేసిన వైసీపీ ప్రభుత్వం

- ప్రస్తుతం మిన్నకుండడంపై విమర్శలు

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

జిల్లాలో చేయూత పథకం నగదు విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోంది. చేయూత నిధుల విడుదలకు సీఎం జగన్‌ బటన్‌ నొక్కి రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ మహిళల ఖాతాల్లోకి డబ్బులు జమ కాలేదు. వారంతా ఆ డబ్బులు ఎప్పుడొస్తాయా? అని ఎదురు చూస్తున్నారు. రెండు నెలలుగా బ్యాంకులకు వెళ్లి ఖాతాల్లో డబ్బులు పడ్డాయా? అని ఆరా తీసిన అనేక మంది మహిళలకు నిరాశే ఎదురైంది. ఎన్నికల ముందు ఖాతాల్లో డబ్బులు వేస్తామని హడావిడి చేసిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు మిన్నకుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అనకాపల్లి జిల్లాలోనే పిసినికాడలో ఈ ఏడాది మార్చి 7న చేయూత నిధులు విడుదల చేస్తూ సీఎం జగన్మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కారు. ఆ రోజు నుంచి 14 రోజుల పాటు చేయూత నిధులు బ్యాంకుల్లో జమ అవుతాయని వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. ఎన్నికల సంఘం మార్చి 16న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడంతో బ్యాంకుల్లో నిధుల జమ ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి. వాస్తవానికి ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోయినా గొప్పలకు పోయి అట్టహాసంగా బటన్‌ నొక్కి డబ్బులు బ్యాంకు ఖాతాల్లో పడతాయని హడావిడి చేసింది. జిల్లాలో 45 నుంచి 60 సంవత్సరాల వయస్సు కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుపేద మహిళలకు ఏటా ప్రభుత్వం రూ.18,750 చొప్పున చేయూత పథకం కింద ఆర్థిక ప్రోత్సాహం అందిస్తోంది. అయితే ప్రభుత్వం ఈసారి నాలుగో విడత కింద జిల్లాలో 1,17,805 మంది లబ్ధిదారులకు రూ.220.88 కోట్లు బ్యాంకుల్లో జమ చేయాల్సి వుంది. కానీ రెండు నెలలు కావస్తున్నా ఒక్క మహిళ ఖాతాలో కూడా నగదు జమ కాకపోవడంతో చేయూత అందుతుందనే ఆశలు లబ్ధిదారుల్లో సన్నగిల్లుతున్నాయి. దీనిపై జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఏపీడీ డౌసీ మాట్లాడుతూ చేయూత నిధుల విడుదలకు ఇబ్బందులు లేవని, ఒకటి రెండు రోజుల్లో మహిళల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతాయని స్పష్టం చేశారు.

Updated Date - May 17 , 2024 | 12:46 AM

Advertising
Advertising