ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మోదకొండమ్మ ఉత్సవ సందడి మొదలు

ABN, Publish Date - May 17 , 2024 | 12:53 AM

సుమారు నెలన్నర రోజులుగా కొనసాగిన ఎన్నికల హడావిడి దాదాపుగా ముగిసింది. ఇదే క్రమంలో జిల్లా కేంద్రం పాడేరులో మోదకొండమ్మ ఉత్సవాల సందడి మొదలైంది. ఈ నెల 19, 20, 21 తేదీల్లో ఉత్సవాలను నిర్వహించనున్నారు. అధికార యంత్రాంగం, ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

అంబేడ్కర్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన భారీ లైటింగ్‌ కటౌట్‌

- ఎన్నికల హడావిడి ముగియడంతో పండగ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం

- పాడేరులో 19, 20, 21 తేదీల్లో ఉత్సవాలు

- నేడు ఉత్సవాలపై కలెక్టర్‌ సమన్వయ సమావేశం

(ఆంధ్రజ్యోతి- పాడేరు)

సుమారు నెలన్నర రోజులుగా కొనసాగిన ఎన్నికల హడావిడి దాదాపుగా ముగిసింది. ఇదే క్రమంలో జిల్లా కేంద్రం పాడేరులో మోదకొండమ్మ ఉత్సవాల సందడి మొదలైంది. ఈ నెల 19, 20, 21 తేదీల్లో ఉత్సవాలను నిర్వహించనున్నారు. అధికార యంత్రాంగం, ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

ఉత్సవాలు ప్రారంభానికి సమయం తక్కువగా ఉండడంతో ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే ఆలయానికి కొత్త రంగులు వేయడంతో పాటు అమ్మవారిని కొలువు తీర్చే శతకంపట్టు పందిరి నిర్మాణం జరుగుతున్నది. ఉత్సవాల్లో భాగంగా పట్ణణ వీఽధుల్లో విద్యుద్దీపాలంకరణ పనులు జరుగుతున్నాయి. అంబేడ్కర్‌ సెంటర్‌ నుంచి అరకులోయ, విశాఖపట్నం, చింతపల్లి వెళ్లే మార్గాల్లో సీరియల్‌ సెట్లతో విద్యుత్‌ అలంకరణ చేస్తున్నారు. పట్టణంలోని మెయిన్‌ రోడ్డుపై భారీ విద్యుత్‌ సెటింగ్‌ల కోసం కటౌట్లు పెట్టారు. మూడు, నాలుగు చోట్ల స్టేజ్‌లను నిర్మించి సినీ, టీవీ నటులతో పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు. చిన్నా పెద్దాలకు వినోదంగా ఉండేలా స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలోని ప్లేజోన్‌లో జెయింట్‌ వీల్‌, డిస్కోడాన్స్‌, డ్రాగన్‌ ట్రైన్‌, పలు రకాల చిన్న పిల్లల ఆటల పరికరాలను ఏర్పాటు చేస్తున్నారు. మూడు రోజుల ఉత్సవాలకు వచ్చే వారికి ఆధ్యాత్మికతతో పాటు వినోదాన్ని అందించేలా ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేస్తున్నది. అధికార యంత్రాంగం సైతం ఉత్సవాలకు వచ్చే భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుధ్యం, వైద్య సేవలు అందించడానికి ఏర్పాటు చేస్తోంది.

నేడు కలెక్టర్‌ ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం

స్థానిక మోదకొండమ్మ ఉత్సవాలపై కలెక్టర్‌ ఎం.విజయసునీత ఆధ్వర్యంలో శుక్రవారం సమన్వయ సమావేశం నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో ఏర్పాట్లపై అధికారులు, ఉత్సవ, ఆలయ కమిటీ ప్రతినిధులతో కలెక్టర్‌ ఇప్పటికే ఒక మారు సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. మరోమారు ఉత్సవాల్లో ఏర్పాట్లు, ఉత్సవ కమిటీ, అధికారులు చేపట్టాల్సిన చర్యలపై స్పష్టత ఇచ్చేందుకు కలెక్టర్‌ శుక్రవారం అందరితో సమన్వయ సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశం అనంతరం ఉత్సవాల ఏర్పాట్లపై ఒక స్పష్టత రానున్నది.

Updated Date - May 17 , 2024 | 12:53 AM

Advertising
Advertising