జీలుగు విత్తనాలు పుచ్చిపోయాయ్
ABN, Publish Date - Jun 08 , 2024 | 01:19 AM
పుచ్చిపోయిన జీలుగు విత్తనాలు సరఫరా చేయడంతో నాతవరం మండలంలోని రైతులు వ్యవయాసాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురుగులతో నిండిపోయిన విత్తనాలు పంపిణీ చేస్తే పంటలు ఎలా పండించగలమని ప్రశ్నిస్తున్నారు. మండలంలోని రైతాంగానికి 50 శాతం సబ్సిడీపై 880 కేజీల జీలుగు, 150 కేజీల పిల్లిపెసర, 15 కేజీల జనుము విత్తనాలను వ్యవయాసాధికారులు సరఫరా చేశారు. అయితే జీలుగు విత్తనాలు పుచ్చిపోయి, పురుగులతో నిండి ఉండడంతో అవి ఏమాత్రం మొలకెత్తే అవకాశంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విత్తనాల కోసం ముందుగా రైతుభరోసా కేంద్రాలలో ఆన్‌లైన్ చేయించుకున్నారని, విత్తనాలను కనీసం పరిశీలించకుండా సరఫరా చేయడంపై మండిపడుతున్నారు. వెంటనే నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలని కోరుతు
సరఫరా చేసిన వ్యవయసాయాధికారులు
గగ్గోలు పెడుతున్న రైతులు
నాతవరం, జూన్ 7:
పుచ్చిపోయిన జీలుగు విత్తనాలు సరఫరా చేయడంతో నాతవరం మండలంలోని రైతులు వ్యవయాసాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురుగులతో నిండిపోయిన విత్తనాలు పంపిణీ చేస్తే పంటలు ఎలా పండించగలమని ప్రశ్నిస్తున్నారు. మండలంలోని రైతాంగానికి 50 శాతం సబ్సిడీపై 880 కేజీల జీలుగు, 150 కేజీల పిల్లిపెసర, 15 కేజీల జనుము విత్తనాలను వ్యవయాసాధికారులు సరఫరా చేశారు. అయితే జీలుగు విత్తనాలు పుచ్చిపోయి, పురుగులతో నిండి ఉండడంతో అవి ఏమాత్రం మొలకెత్తే అవకాశంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విత్తనాల కోసం ముందుగా రైతుభరోసా కేంద్రాలలో ఆన్‌లైన్ చేయించుకున్నారని, విత్తనాలను కనీసం పరిశీలించకుండా సరఫరా చేయడంపై మండిపడుతున్నారు. వెంటనే నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలని కోరుతున్నారు.
వరి విత్తనాలకు ఎదరుచూపులు
ఖరీఫ్ ఆరంభమవుతున్నా వరివిత్తనాల సరాఫరాపై అధికారులు స్పందించడం లేదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే చెరువుల కింద పొలాల్లో ఆకుమడులను సిద్ధం చేసుకున్నామని, ఏటా జూలైలో వరినాట్లు వేస్తామని చెబుతున్నారు. ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయని, ఈ దశలో వరి విత్తనాలు సరాఫరా చేయకపోతే సమయానికి ఆకు లభించే పరిస్థితి ఉండదంటున్నారు. గత ఏడాది కూడా నాతవరం మండలంలో అరకొరగా వరి విత్తనాలను సరఫరా చేశారని గుర్తుచేస్తున్నారు. ముఖ్యంగా ఆర్‌జేఎల్ రకం సక్రమంగా పంపిణీ చేయలేదని గుర్తుచేస్తున్నారు.
Updated Date - Jun 08 , 2024 | 01:19 AM