ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తాడి గ్రామంలో జడ్సీ పర్యటన

ABN, Publish Date - Jun 26 , 2024 | 12:48 AM

ఫార్మా కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామంలో మంగళవారం అనకాపల్లి జోనల్‌ కమిషనర్‌ వి.అయ్యప్పనాయుడు, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఈఈ పీవీ ముకుందరావు పర్యటించారు.

గ్రామస్థులతో మాట్లాడుతున్న జోనల్‌ కమిషనర్‌ అయ్యప్పనాయుడు, పీసీబీ ఈఈ ముకుందరావు

పరవాడ, జూన్‌ 25 : ఫార్మా కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామంలో మంగళవారం అనకాపల్లి జోనల్‌ కమిషనర్‌ వి.అయ్యప్పనాయుడు, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఈఈ పీవీ ముకుందరావు పర్యటించారు. ఇటీవల నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) తాడి గ్రామానికి సురక్షితమైన తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాల మేరకు అధికారులు గ్రామంలో పర్యటించి స్థానిక రక్షిత మంచినీటి ట్యాంక్‌ను పరిశీలించారు. అనంతరం నీటి నమూనాలను సేకరించారు. గ్రామానికి సురక్షితమైన తాగునీరు సరఫరా చేస్తామని అధికారులు గ్రామస్థులకు తెలిపారు. కాగా గ్రామానికి తాగునీరుతో పాటు ఉచిత వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని, గ్రామాన్ని తరలించే వరకు ఎప్పటికప్పుడు కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను మాజీ ఎంపీపీ మాదంశెట్టి నీలబాబు, మాజీ సర్పంచ్‌ బొడ్డపల్లి అప్పారావు కోరారు. గ్రామస్థుల విజ్ఞప్తి మేరకు చర్యలు చేపడతామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కోమటి సూరిబాబు, కె. పైడిరాజు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 26 , 2024 | 12:48 AM

Advertising
Advertising