రోగికి తప్పని డోలీమోత
ABN, Publish Date - Aug 24 , 2024 | 01:22 AM
గిరిజనులకు డోలీమోతలు తప్పడం లేదు. అనారోగ్యానికి గురైన గిరిజన మహిళను కుటుంబ సభ్యులు 6 కిలోమీటర్లు మోసుకు వచ్చి, అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మండలంలోని మారుమూల పినకోట పంచాయతీ బోనూరు గ్రామానికి చెందిన సెంబీ అచ్చమ్మ(46) గురువారం పశువుల కాపునకు వెళ్లి ప్రమాదశాత్తూ జారిపడి గాయపడింది.
మహిళను 6 కి.మీ.మోసుకొచ్చిన
కుటుంబ సభ్యులు
చటకంబ నుంచి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలింపు
అనంతగిరి, ఆగస్టు 23:
గిరిజనులకు డోలీమోతలు తప్పడం లేదు. అనారోగ్యానికి గురైన గిరిజన మహిళను కుటుంబ సభ్యులు 6 కిలోమీటర్లు మోసుకు వచ్చి, అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మండలంలోని మారుమూల పినకోట పంచాయతీ బోనూరు గ్రామానికి చెందిన సెంబీ అచ్చమ్మ(46) గురువారం పశువుల కాపునకు వెళ్లి ప్రమాదశాత్తూ జారిపడి గాయపడింది. ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు గ్రామానికి అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను 6 కిలోమీటర్లు డోలీపై చంటకంభ వరకు మోసుకొచ్చారు. అక్కడ నుంచి అంబులెన్స్‌లోని పినకోట పీహెచ్‌సీకి తరలించి, మెరుగైన వైద్యసేవలను నిమిత్తం కె.కోటపాడు సీహెచ్‌సీకి తరలించారు. పినకోట-గంగవరం తారురోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Updated Date - Aug 24 , 2024 | 01:22 AM