ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మెడ్‌టెక్‌ జోన్‌లో ఇష్టారాజ్యం

ABN, Publish Date - Jul 11 , 2024 | 01:26 AM

మెడ్‌టెక్‌ జోన్‌ చంద్రబాబునాయుడి మానస పుత్రిక. వైద్య రంగానికి అవసరమైన ఆధునిక పరికరాలు తయారుచేసేందుకు ఏర్పాటుచేశారు. దేశంలో ఈ తరహా పరిశ్రమ ఇదే మొదటిది. 2016లో నిర్మాణానికి శంకుస్థాపన చేసి అతి తక్కువ సమయంలో పూర్తిచేసి సీఎంగా ఆయనే ప్రారంభోత్సవం కూడా చేశారు. స్టీల్‌ప్లాంటు సమీపాన పెదగంట్యాడ మండలంలో సుమారు 270 ఎకరాల్లో ఏర్పాటుచేశారు. ఇప్పటివరకు రూ.500 కోట్లు వెచ్చించారు. కానీ ఆశించిన ప్రగతి లేదు. వైసీపీ ప్రభుత్వం దీనిని పట్టించుకోలేదు.

ఐదేళ్లుగా అక్కడ ఆయన చెప్పిందే వేదం

ఎదురు మాట్లాడితే కంపెనీలకు తాళాలే

ఆడిటింగ్‌ లేదు...

ప్రచారం ఎక్కువ...పనితీరు తక్కువ

గాడిలో పెట్టకపోతే మరింత నిర్వీర్యం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

మెడ్‌టెక్‌ జోన్‌ చంద్రబాబునాయుడి మానస పుత్రిక. వైద్య రంగానికి అవసరమైన ఆధునిక పరికరాలు తయారుచేసేందుకు ఏర్పాటుచేశారు. దేశంలో ఈ తరహా పరిశ్రమ ఇదే మొదటిది. 2016లో నిర్మాణానికి శంకుస్థాపన చేసి అతి తక్కువ సమయంలో పూర్తిచేసి సీఎంగా ఆయనే ప్రారంభోత్సవం కూడా చేశారు. స్టీల్‌ప్లాంటు సమీపాన పెదగంట్యాడ మండలంలో సుమారు 270 ఎకరాల్లో ఏర్పాటుచేశారు. ఇప్పటివరకు రూ.500 కోట్లు వెచ్చించారు. కానీ ఆశించిన ప్రగతి లేదు. వైసీపీ ప్రభుత్వం దీనిని పట్టించుకోలేదు.

మెడ్‌టెక్‌ జోన్‌కు అంకురార్పణ జరిగినప్పటి నుంచి ఇప్పటివరకూ ఒకే వ్యక్తి ఆధ్వర్యంలో నడుస్తోంది. ఆయన అదంతా తన సామ్రాజ్యంగా భావించి ఎవరినీ లెక్కచేయడం లేదు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆయన చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదు. దాదాపు ఎనిమిదేళ్లు అవుతున్నా ఆర్థిక వ్యవహారాలపై సరైన ఆడిటింగ్‌ లేదు. ఒప్పందాలను సమీక్షించే దిక్కు లేదు. ఎవరితో ఏ రకమైన ఒప్పందం జరుగుతున్నదో...ఆ తరువాత అది ఏమవుతున్నదో పట్టించుకునేవారు లేరు. సంస్థలను రప్పించడానికి కల్లబొల్లి కబుర్లు చెప్పడం, పెద్ద పెద్ద హామీలు ఇవ్వడం, ఆ తరువాత వాటిని అమలు చేయకపోవడం వల్ల అనేక సంస్థలు ఇక్కడి నుంచి వెళ్లిపోయాయనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఏ సంస్థ అయినా వారి హక్కులు గురించి మాట్లాడితే, వెంటనే ఆ కంపెనీకి తాళాలు వేయించి, వేధించడం వంటి పనులు కూడా ఇక్కడ జరుగుతున్నాయంటే...పెట్టుబడిదారులతో ఎలా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అసలు ఎన్ని కంపెనీలు వచ్చాయి?, ఎంత టర్నోవర్‌ జరిగింది?, జోన్‌కు ఎంత లాభం వచ్చింది?, ఉద్యోగ అవకాశాలు ఎంతమందికి కల్పించారు?...అనే విషయాలపై ఈ ఐదేళ్లలో ఎప్పుడు నోరు విప్పి మాట్లాడింది లేదు. నిధులు దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణలు వచ్చాయి. వేటిపైనా సరైన విచారణ జరగలేదు. వారం క్రితం కూడా ఓ సంస్థకు తాళాలు వేయించేశారు. ఎంతో నమ్మకంతో వచ్చి ఇక్కడ కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే గొడవపడి పెద్ద పెద్ద కేకలు వేస్తూ చెప్పుకోలేని విధంగా వ్యవహరిస్తున్నారని పెట్టుబడిదారులు వాపోతున్నారు. ఎవరికి ఉద్యోగాలు ఇస్తారో, ఎవరిని ఎందుకు తీసేస్తారో సరైన కారణాలు ఉండవనే ఆరోపణలు ఉన్నాయి. ఎవరికీ తాము జవాబుదారులం కాదనే తీరుతో వ్యవహారాలు సాగుతున్నాయి. కామన్‌ సైన్స్‌ ఫెసిలిటీలు అనేకం ఉన్నాయని భ్రమలు కల్పించి తీసుకువస్తున్నారని, అనేక కంపెనీలు ఉన్నాయని, వస్తాయని, పెద్ద సంఖ్యలో పరికరాల తయారీకి ఆర్డర్లు వస్తాయని ఆశలు కల్పిస్తున్నారని, తీరా ఇక్కడకు వచ్చాక ఆంక్షలు పెట్టి, కంపెనీ నుంచి కాలు బయట పెట్టడానికి కూడా అనుమతి తీసుకోవాలనే విధంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

అన్ని నిర్మాణాలు ఒక్కరికే

ఇక్కడ వివిధ సంస్థలకు భూమి కేటాయిస్తారు. వారు నిర్మాణాలు చేసుకోవడానికి టెండర్లు ఆహ్వానిస్తారు. కానీ వాటిని పక్కకునెట్టి ఒకరికే నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తారు. అందులో మతలబు ఏమిటనేది అర్థం కాదు. జోన్‌ ప్రారంభించినప్పుడు ఒక సంస్థ నిర్మాణ బాధ్యతలు తీసుకుంది. వారి దగ్గర పనిచేసే ముఖ్యమైన వ్యక్తిని తీసుకొని, ఇప్పుడు ఆయనకే అన్ని కాంట్రాక్టులు ఇప్పిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఇక్కడ ఆర్థిక వ్యవహారాలు సరిగ్గా లేవు. ఎకో సిస్టమ్‌ అభివృద్ధి చేస్తున్నామని నిర్మాణాలు చేపడుతుంటారు. కానీ వాటి ఫలితం ఎక్కడా కనపడదు. సమావేశాలు నిర్వహించడం, పెద్దగా అరవడం, ఎవరైనా ఏదైనా ప్రశ్నిస్తే వారిని బయటకు పంపేయడం...ఇదే తరహాలో వ్యవహారాలు సాగుతున్నాయి. ఇక్కడ ఏర్పాటయ్యే కంపెనీలు భూమిని లీజుకు తీసుకుంటాయి. డబ్బులు చెల్లిస్తాయి. అవన్నీ ఎక్కడికి వెళుతున్నాయనే దానికి సరైన లెక్కలు లేవు. పరిశ్రమలు పెట్టేవారికి ఇబ్బందులు ఉండకూడదని సింగిల్‌ విండో విధానంలో అనుమతులు ఇస్తుంటే...వాటిని ఇక్కడ దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా అధికారులెవరినీ రానివ్వకపోవడం, పరిశ్రమల శాఖ అధికారులకూ సరైన సమాచారం అందించకపోవడం వంటి లోపాలు ఉన్నాయి. దీనిని పరిశీలించడానికి గురువారం వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఈ జోన్‌ వ్యవహారాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి ప్రక్షాళన చేయకపోతే ఆశించిన ప్రయోజనం చేకూరదు. కరోనాలో మాస్క్‌లు తయారు చేశామనో, ఆక్సిజన్‌ అందించామనే కబుర్లు కాకుండా వైద్య రంగానికి ఉపయోగపడే పరికరాలు ఏమి తయారుచేశారో, ఎంత ఉత్పత్తి జరిగిందో, ఎన్ని పెట్టుబడులు వచ్చాయో, ఎంతమందికి ఉపాధి కల్పించాలో అక్కడి అధికారులు చెప్పాల్సిన అవసరం ఉంది.

Updated Date - Jul 11 , 2024 | 01:26 AM

Advertising
Advertising
<