ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ముడసర్లోవ పార్కులో హార్స్‌ రైడింగ్‌ ప్రాజెక్టు

ABN, Publish Date - Jul 15 , 2024 | 12:53 AM

అనేక జీవరాశుల ఆవాసంగా ఉన్న ముడసర్లోవ రిజర్వాయర్‌ పార్కులో హార్స్‌ రైడింగ్‌ ప్రాజెక్టు పేరుతో విధ్వంసం సృష్టిస్తున్నారు.

  • నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు

  • యంత్రాలతో భూమి చదును, పొదల తొలగింపు

  • జీవవైవిధ్యానికి ముప్పువాటిల్లుతుందని పర్యావరణవేత్తల ఆందోళన

  • తక్షణం పనులు నిలిపేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ

  • స్పందించిన డిప్యూటీ సీఎం కార్యాలయ అధికారులు

  • జీవీఎంసీ అధికారులను వివరణ కోరినట్టు సమాచారం!

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

అనేక జీవరాశుల ఆవాసంగా ఉన్న ముడసర్లోవ రిజర్వాయర్‌ పార్కులో హార్స్‌ రైడింగ్‌ ప్రాజెక్టు పేరుతో విధ్వంసం సృష్టిస్తున్నారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు నగరంలో గుర్రపు స్వారీ అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా జీవీఎంసీ అధికారులు రూ.5.5 కోట్ల వ్యయంతో ముడసర్లోవపార్కులో పనులు ప్రారంభించారు. పార్కులో ఎటువంటి కాంక్రీట్‌ నిర్మాణాలు చేపట్టకూడదనే నిబంధన ఉన్నప్పటికీ అడ్డగోలుగా పనులు పూర్తిచేస్తున్నారు. యంత్రాలతో మొక్కలు, ్లపొదలను తొలగించడంతో అనేక జీవుల మనుగడకు ముప్పు వాటిల్లుతోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలోనే అత్యంత పురాతనమైనదిగా ముడసర్లోవ రిజర్వాయర్‌కు గుర్తింపు వుంది. నగర ప్రజల తాగునీటి అవసరాల కోసం 1901లో దీనిని నిర్మించారు. 80 ఎకరాల్లో విస్తరించి ఉన్న రిజర్వాయర్‌కు సుమారు 4,216 ఎకరాల పరీవాహక ప్రాంతం ఉంది. రిజర్వాయర్‌ను ఆనుకుని 20 ఎకరాల్లో పార్కును నిర్మించారు. ఇందులో అనేక జాతులకు చెందిన వేలాడి చెట్లు ఉండడంతో చిట్టడవిని తలపిస్తుంది. పార్కుకు ఒకవైపు రిజర్వాయర్‌, మరోవైపు చెట్లు ఉండడంతో సుమారు 105 రకాల పక్షులు ఇక్కడ ఆవాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నాయి. ప్రకృతి ఆలవాలమైన ముడసర్లోవ పార్కును నగరవాసులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు కూడా సందర్శిస్తుంటారు.

అంచెలంచెలుగా విధ్వంసం

జాతీయస్థాయి పర్యావరణవేత్తలు, ఉద్యమకారులు నగరానికి వచ్చి సందర్భంగా అత్యంతపురాతమైన ముడసర్లోవపార్కును పరిశీలించి, దానిని పరిరక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూనే ఉన్నారు. అయితే ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిన జీవీఎంసీ అధికారులు అంచెలంచెలుగా విధ్వంసానికి పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా పార్కులోని సుమారు నాలుగు ఎకరాల స్థలాన్ని హార్స్‌రైడింగ్‌ ప్రాజెక్టుకు కేటాయించారు. రూ.5.5 కోట్ల వ్యయంతో ఏర్పాటుచేసే ఈ ప్రాజెక్టు కోసం నిబంధనలకు విరుద్ధంగా కాంక్రీట్‌తో భారీ నిర్మాణాలు చేపడుతున్నారు. గుర్రాలను ఉంచడానికి ప్రత్యేకంగా షెడ్లు, గుర్రపు స్వారీ చేయడానికి ట్రాక్‌ నిర్మాణం, సందర్శకులు వేచి వుండేందుకు షెడ్ల నిర్మాణం చేపడుతున్నారు. ఇక్కడి పార్కులో చెట్లను తొలగించడం చట్టరీత్యా నేరమని తెలిసినప్పటికీ, యంత్రాల సాయంతో మొక్కలు, గుబురుగా పెరిగిన పొదలతో పాటు, భారీవృక్షాల కొమ్మలను తొలగించేస్తున్నారు. దీనివల్ల పార్కులో పక్షుల ఆవాసానికి ఇబ్బందులు తలెత్తడంతోపాటు, వాటి జీవనం కూడా ప్రశ్నార్థకంగా మారుతోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

స్పందించిన డిప్యూటీ సీఎం

ఈ మేరకు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, పర్యావరణవేత్త ఈఏఎస్‌ శర్మ రాష్ట్ర ప్రభుత్వానికి, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు లేఖ కూడా రాశారు. ముడసర్లోవపార్కులో జరుగుతున్న పనులను తక్షణం నిలిపివేయాలని, 105 రకాల జీవజాతుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. ఈ లేఖపై డిప్యూటీ సీఎం కార్యాలయ అధికారులు స్పందించి జీవీఎంసీ అధికారులను వివరణ కోరినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా అధికారులు పనులు నిలిపివేసి, హార్స్‌రైడింగ్‌ ప్రాజెక్టును మరో ప్రాంతానికి తరలించాలని పర్యావరణ వేత్తలతో పాటు, నగర వాసులు కోరుతున్నారు.

Updated Date - Jul 15 , 2024 | 12:53 AM

Advertising
Advertising
<