ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అల్లూరి చరిత్ర ఉద్యమాలకు స్ఫూర్తి

ABN, Publish Date - Jul 05 , 2024 | 01:13 AM

ఉద్యమాలకు స్ఫూర్తి విప్లవ వీరుడు అల్లూరి జీవిత చరిత్ర అని ఎస్పీ కేవీ మురళీకృష్ణ అన్నారు. గురువారం సాయంత్రం గొలుగొండ మండలం కృష్ణాదేవిపేట అల్లూరి మైత్రి గ్రంథాలయం వద్ద ఏర్పాటు చేసిన నిలువెత్తు ఫైబర్‌ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.

కృష్ణాదేవిపేట గ్రంథాలయం వద్ద నిలువెత్తు అల్లూరి ఫైబర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఎస్పీ కేవీ మురళీకృష్ణ

ఎస్పీ కేవీ మురళీకృష్ణ

కృష్ణాదేవిపేట, జూలై 4: ఉద్యమాలకు స్ఫూర్తి విప్లవ వీరుడు అల్లూరి జీవిత చరిత్ర అని ఎస్పీ కేవీ మురళీకృష్ణ అన్నారు. గురువారం సాయంత్రం గొలుగొండ మండలం కృష్ణాదేవిపేట అల్లూరి మైత్రి గ్రంథాలయం వద్ద ఏర్పాటు చేసిన నిలువెత్తు ఫైబర్‌ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి నడయాడిన ఈ ప్రాంతంలో అందరూ అల్లూరి అడుగుజాడలో నడవాలన్నారు. ఉద్యోగులు, పోలీసులు భాగస్వాములై తొమ్మిదేళ్ల క్రితం గ్రంథాలయం ఏర్పాటు చేసి అల్లూరి విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం కృష్ణాదేవిపేట హైస్కూల్‌లో టెన్త్‌, ప్రభుత్వం జూనియర్‌ కళాశాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన ఆరుగురు విద్యార్థులకు కలిపి రూ.20 వేల నగదును విద్యార్థులకు ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మణికుమారి, సర్పంచ్‌ సుజాత, నర్సీపట్నం డీఎస్పీ మోహన్‌, శ్రీకాకుళం సిటీ సీఐ సోమశేఖర్‌, ఏలూరు సీఐ అల్లు స్వామినాయుడు, విశాఖ సిటీ సీఐ పి.ఉదయ్‌కుమార్‌, నర్సీపట్నంరూరల్‌, కొయ్యూరు సీఐలు బి.హరి, ఎస్‌వీ రమణ, కృష్ణాదేవిపేట, నర్సీపట్నంరూరల్‌ ఎస్‌ఐలు ఉపేంద్ర, భీమరాజు, అల్లూరి మైత్రి గ్రంథాలయ సభ్యులు శర్మ, డేవిడ్‌రాజు, పోతల శ్రీరామ్మూర్తి , అప్పలకొండ, సత్యనారాయణ, వాసు, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 01:13 AM

Advertising
Advertising