ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Ganta Srinivasa Rao: ప్రశాంత విశాఖకు రౌడీల రాజ్యం తెచ్చారు

ABN, Publish Date - Mar 05 , 2024 | 08:28 PM

సీఎం జగన్ రెడ్డి(CM Jagan)పై మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao) X(ట్విట్టర్) వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖకు జగన్, ఆయన అనుచరులు వచ్చాక ఆగడాలు మీతిమీరిపోయాయని అన్నారు. విశాఖలో ప్రజలకు రక్షణ లేకుండా చేశారని మండిపడ్డారు. ఆయనకు త్వరలోనే ప్రజలు చరమగీతం పాడుతారని హెచ్చరించారు.

విశాఖపట్నం: సీఎం జగన్ రెడ్డి(CM Jagan)పై మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao) X(ట్విట్టర్) వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖకు జగన్, ఆయన అనుచరులు వచ్చాక ఆగడాలు మీతిమీరిపోయాయని అన్నారు. విశాఖలో ప్రజలకు రక్షణ లేకుండా చేశారని మండిపడ్డారు. ఆయనకు త్వరలోనే ప్రజలు చరమగీతం పాడుతారని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీను బంగాళఖాతంలో కలిపేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రశాంత విశాఖకు రాజధాని పేరుతో రౌడీల రాజ్యం తెచ్చేసి రణరంగ క్షేత్రాన్ని సృష్టించారని విరుచుకుపడ్డారు. అందుకే విశాఖ ప్రజలంతా ముక్తకంఠంతో ‘రావద్దు జగన్.. మాకొద్దు జగన్’ అంటూ స్వరం పెంచారని చెప్పారు.

వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి చిత్తశుద్ధితో ఉన్నామనే సంగతి ఎన్నికలకు ఒక నెల ముందు గుర్తుకొచ్చిందా జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నించారు. విశాఖలో ఉన్న పరిశ్రమలను పొరుగు రాష్ట్రాలకు తరిమేసి.... ఇప్పుడేమో విశాఖలో ఉద్యోగాలను కల్పిస్తామని ఊదరకొడుతున్నారని అన్నారు. ఆయన మాటలను నమ్మే పరిస్థితిలో విశాఖ వాసులు లేరని.. ఇక్కడి ప్రజలు చాలా తెలివైనవారని చెప్పారు. విశాఖలో ప్రమాణ స్వీకారం కాదని.. ఇక్కడి నుంచే వైసీపీ ప్రభుత్వ పతనం మొదలవుతుందని గుర్తుంచుకోవాలని గంటా శ్రీనివాసరావు హెచ్చరించారు. ‘‘నెలలో వస్తా... సంక్రాంతికి వస్తా....ఉగాదికి వస్తా.. జగన్ చెప్పే ఐదేళ్ల అంకం ముగిసింది. మీరు కాపురానికి వచ్చింది లేదు..రేపు మీరు గెలిచేది లేదు..ప్రమాణ స్వీకారానికి వచ్చేది లేదు. "City of Destiny" గా ఉన్న విశాఖను మీరొచ్చాక "City of Danger " గా మార్చేశారు’’ అని గంటా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 05 , 2024 | 08:28 PM

Advertising
Advertising