ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Ganta Srinivasa Rao: ఏపీలో వైసీపీ నేతల దౌర్జన్యకాండకు హద్దు అదుపు లేదు

ABN, Publish Date - Feb 19 , 2024 | 08:51 PM

పీలో వైసీపీ నేతల దౌర్జన్యకాండకు హద్దు అదుపు లేకుండా పోయిదంటూ ఎక్స్(ట్విట్టర్) వేదికగా మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

విశాఖపట్నం: ఏపీలో వైసీపీ నేతల దౌర్జన్యకాండకు హద్దు అదుపు లేకుండా పోయిదంటూ ఎక్స్(ట్విట్టర్) వేదికగా మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాప్తాడులో జర్నలిస్ట్‌పై దాడిని తీవ్రంగా ఖండించారు. వైసీపీ పాలన వైఫల్యాలు, నేతల అవినీతిని వెలికి తీసిన వారిపై కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మీడియా ప్రతినిధులపై దాడులు నిత్యకృత్యమయ్యాయని ధ్వజమెత్తారు. రాప్తాడు ‘సిద్ధం’ సభలో ఆంధ్రజ్యోతి విలేకరిపై దాడి జరుగుతున్నా పోలీసులు నిలువరించకపోవడం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పాలనకు అద్దం పడుతోందన్నారు.

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను నిస్సహాయులను చేయడమే కాకుండా వారిని కూడా అధికార పార్టీ నేరాల్లో భాగస్వాములను చేస్తూ సరికొత్త మార్గానికి శ్రీకారం చుట్టారని అన్నారు. మొన్నటికి మొన్న గుంటూరు జిల్లా పెదకూరపాడులో ఇసుక మాఫియా గురించి వార్త రాసేందుకు వెళ్లిన విలేకరిపై తీవ్రంగా దాడి చేశారని మండిపడ్డారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు నిందితులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని గంటా శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 19 , 2024 | 09:00 PM

Advertising
Advertising