ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జి.మాడుగుల ఎంపీపీ రాజీనామా

ABN, Publish Date - Jul 31 , 2024 | 12:41 AM

జి.మాడుగుల ఎంపీపీ పద్మ రాజీనామా చేసింది. రెండున్నరేళ్ల ఒప్పందం మేరకు ఆమె రాజీనామా పత్రాన్ని జిల్లాపరిషత్‌ సీఈవో పోలినాయుడుకు మంగళవారం అందజేశారు.

జడ్పీ సీఈవో పోలినాయుడికి రాజీనామా పత్రం అందజేస్తున్న ఎంపీపీ పద్మ

ముగిసిన రెండున్నరేళ్లు ఒప్పందం

జడ్పీ సీఈవోకి రాజీనామా పత్రం అందజేసిన ఎంపీపీ పద్మ

జి.మాడుగుల, జూలై 30: జి.మాడుగుల ఎంపీపీ పద్మ రాజీనామా చేసింది. రెండున్నరేళ్ల ఒప్పందం మేరకు ఆమె రాజీనామా పత్రాన్ని జిల్లాపరిషత్‌ సీఈవో పోలినాయుడుకు మంగళవారం అందజేశారు. వివరాల్లోకి వెళితే..

మండలంలో 15 మండల ప్రాదేశిక నియోజకవర్గాలు (ఎంపీటీసీ స్థానాలు) ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి ఏడు స్థానాలు, టీడీపీకి ఏడు స్థానాలు వచ్చాయి. ఒక స్థానంలో స్వతంత్య్ర అభ్యర్థి పద్మ విజయం సాధించింది. రెండు పార్టీలకు సరైన మెజారిటీ దక్కకపోవడంతో గడుతూరు సెగ్మెంటు నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా విజయం సాధించిన కొర్రా పద్మ టీడీపీ మద్దతుతో ఎంపీపీ అయ్యింది. ఆ సమయంలో రెండున్నరేళ్లు పాటు పద్మ ఎంపీపీగాను, మరో రెండున్నరేళ్లు బొయితిలి ఎంపీటీసీ సభ్యుడు లొంబోరి అప్పలరాజు ఎంపీపీగా కొనసాగేందుకు ఒప్పందం కుదిరింది. ఒప్పందం మేరకు రెండున్నరేళ్లు ముగియడంతో టీడీపీ నేతల సూచన మేరకు మంగళవారం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాపరిషత్‌ కార్యాలయంలో సీఈవో పోలినాయుడికి పద్మ రాజీనామా పత్రాన్ని అందజేసింది.

Updated Date - Jul 31 , 2024 | 12:42 AM

Advertising
Advertising
<