డ్వాక్రా మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యం
ABN, Publish Date - Jul 26 , 2024 | 12:33 AM
ఈ ఏడాది 6,500 మంది డ్వాక్రా మహిళలను లక్షాధికారులను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని డీఆర్‌డీఏ పీడీ శచిదేవి తెలిపారు. గురువారం నర్సీపట్నం క్లస్టర్ పరిధిలోని నర్సీపట్నం, మాకవరపాలెం, గొలుగొండ, నాతవరం, రోలుగుంట మండలాల ఏపీఎంలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డ్వాక్రా రుణాలు ఇప్పించడంతో పాటు సకాలంలో రుణాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
- డీఆర్‌డీఏ పీడీ శచిదేవి
నర్సీపట్నం, జూలై 25 : ఈ ఏడాది 6,500 మంది డ్వాక్రా మహిళలను లక్షాధికారులను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని డీఆర్‌డీఏ పీడీ శచిదేవి తెలిపారు. గురువారం నర్సీపట్నం క్లస్టర్ పరిధిలోని నర్సీపట్నం, మాకవరపాలెం, గొలుగొండ, నాతవరం, రోలుగుంట మండలాల ఏపీఎంలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డ్వాక్రా రుణాలు ఇప్పించడంతో పాటు సకాలంలో రుణాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిశ్రమలు పెట్టుకోవడానికి ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ స్కీమ్ పథకంలో డ్వాక్రా మహిళలకు రుణాలు ఇప్పిస్తామని చెప్పారు. ఈ ఏడాది 6500 మంది డ్వాక్రా మహిళలను లక్షాధికారులను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. చిన్న చిన్న కుటీర పరిశ్రమలు, వ్యాపారాలు పెట్టుకునే వారికి కూడా రూ.50 వేలు నుంచి రూ.లక్ష వరకు రుణాలు ఇప్పిస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఉన్నతి కార్యక్రమంలో భాగంగా రూ.8.5 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, గత ఏడాది రూ.7 కోట్లు రుణాలు ఇచ్చామన్నారు. జిల్లాలో 40 వేలు డాక్రా సంఘాలలో 4.43 లక్షలు మంది సభ్యులుగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ డైజీ, ప్రాంతీయ సమన్వయకర్త కె.సత్యనారాయణ, డీపీఎం శ్రీనివాస్, వరప్రసాద్, రమణ, ఐదు మండలాల ఏపీపీఎంలు పాల్గొన్నారు.
Updated Date - Jul 26 , 2024 | 12:33 AM