డిగ్రీ ఫలితాల్లో డీవీఎన్ కళాశాల విద్యార్థిని ప్రతిభ
ABN, Publish Date - May 26 , 2024 | 12:03 AM
ఆంధ్రా యూనివర్సిటీ విడుదల చేసిన డిగ్రీ పరీక్షా ఫలితాల్లో స్థానిక దాడి వీరునాయుడు కళాశాలకు చెందిన పెంటకోట అనురాధ బీకాం కంప్యూటర్ అప్లికే షన్‌లో విశ్వవిద్యాలయ స్థాయిలో టాపర్‌గా నిలి చిందని కళాశాల ప్రిన్సిపాల్ కోరిబిల్లి రమేష్ తెలిపారు.
అనకాపల్లి టౌన్, మే 25 : ఆంధ్రా యూనివర్సిటీ విడుదల చేసిన డిగ్రీ పరీక్షా ఫలితాల్లో స్థానిక దాడి వీరునాయుడు కళాశాలకు చెందిన పెంటకోట అనురాధ బీకాం కంప్యూటర్ అప్లికే షన్‌లో విశ్వవిద్యాలయ స్థాయిలో టాపర్‌గా నిలి చిందని కళాశాల ప్రిన్సిపాల్ కోరిబిల్లి రమేష్ తెలిపారు. తుమ్మపాలలో నివ సిస్తున్న పెంటకోట శ్రీను, రమాదేవిల కుమార్తె అనురాధ మధ్య తరగతికి చెందిన విద్యార్థిని. ఈమె బి.కాం కంప్యూటర్ అప్లికేషన్ గ్రూపులో 9.46 గ్రేడ్ పాయింట్లు సాధించి, యూనివర్సిటీ టాపర్‌గా నిలిచిందని ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ సందర్భంగా అనురాధను కళాశాల చైర్మన్ దాడి రత్నాకర్ శనివారం అభినందించారు. విద్యార్థులు విశ్వవిద్యాలయ, జిల్లా స్థాయిల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరచడం అభినందనీయమన్నారు.
Updated Date - May 26 , 2024 | 12:03 AM