ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

శిథిలావస్థలో పశువైద్య కేంద్ర భవనం

ABN, Publish Date - Apr 20 , 2024 | 01:05 AM

మండలంలోని రాచపల్లి పశువైద్య కేంద్రం భవనం శిథిలావస్థకు చేరుకుంది. దీంతో సిబ్బంది భయపడుతూ విధులను నిర్వహిస్తున్నారు. ఈ పశువైద్య కేంద్రానికి ధర్మవరం, తామరం, ఎరకన్నపాలెం, కొత్తపాలెం, జి.వెంకటాపురం, సుభద్రయ్యపాలెం గ్రామాలకు చెందిన పశువులకు వైద్య సేవలు అందిస్తుంటారు.

శిథిలావస్థలో ఉన్న పశువైద్య కేంద్ర భవనం

రాచపల్లిలో ఇబ్బందుల నడుమ సిబ్బంది విధులు

శ్లాబ్‌ నుంచి ఊడి పడుతున్న పెచ్చులు

వర్షాకాలంలో తడిసిపోతున్న మందులు

నూతన భవనానికి నిధుల కోసం పాడి రైతులు వినతి

మాకవరపాలెం, ఏప్రిల్‌ 19 : మండలంలోని రాచపల్లి పశువైద్య కేంద్రం భవనం శిథిలావస్థకు చేరుకుంది. దీంతో సిబ్బంది భయపడుతూ విధులను నిర్వహిస్తున్నారు. ఈ పశువైద్య కేంద్రానికి ధర్మవరం, తామరం, ఎరకన్నపాలెం, కొత్తపాలెం, జి.వెంకటాపురం, సుభద్రయ్యపాలెం గ్రామాలకు చెందిన పశువులకు వైద్య సేవలు అందిస్తుంటారు. ఐదేళ్లుగా ఈ భవనం శిథిలావస్థకు చేరడంతో పశువులకు వైద్య సేవలు సరిగా అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ భవనంలో ఉన్న మందులు వర్షం పడితే పూర్తిగా తడిసిపోతున్నాయి. దీనికి తోడు విధులు నిర్వహిస్తున్నప్పడు శ్లాబ్‌ నుంచి పెచ్చులూడి పడుతున్నాయని సిబ్బంది వాపోతున్నారు. పలువురు పాడి రైతులు సైతం ఇదే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశువులకు ఉచిత వ్యాక్సిన్‌ వేసేటప్పుడు వాక్సిన్‌ను భద్రపర్చేందుకు నానాపాట్లు పడుతున్నట్టు చెపుతున్నారు. ఈ భవనం దుస్థితి ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినా పట్టించుకునేవారు కరువయ్యారన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇక్కడి పశువైద్య శాలకు నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాల్సిందిగా పాడి రైతులు కోరుతున్నారు.

Updated Date - Apr 20 , 2024 | 01:05 AM

Advertising
Advertising