జీవీఎంసీ జోనల్ కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా
ABN, Publish Date - Sep 18 , 2024 | 12:15 AM
జీవీఎంసీ అనకాపల్లి జోన్‌లో పనిచేస్తున్న క్లాప్ లోడర్స్‌కు బకాయి పడిన వేతనాలు వెంటనే చెల్లించాలని జీవీఎంసీ కాంట్రాక్టు ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షుడు గంటా శ్రీరామ్ డిమాండ్ చేశారు.
అనకాపల్లి టౌన్, సెప్టెంబరు 17: జీవీఎంసీ అనకాపల్లి జోన్‌లో పనిచేస్తున్న క్లాప్ లోడర్స్‌కు బకాయి పడిన వేతనాలు వెంటనే చెల్లించాలని జీవీఎంసీ కాంట్రాక్టు ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షుడు గంటా శ్రీరామ్ డిమాండ్ చేశారు. జోనల్ కార్యాలయం గేటు వద్ద మంగళవారం వారు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ మూడు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో కార్మికులు పనులను నిలుపుదల చేసి ఆందోళన చేస్తున్నారన్నారు. తక్షణమే వేతనాలు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్‌ఐ అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ జోన్ అధ్యక్షుడు వై.వరప్రసాద్, ఎస్.భారతి, పోలరావు పాల్గొన్నారు.
Updated Date - Sep 18 , 2024 | 12:15 AM