జీవీఎంసీ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన డీఈవో
ABN, Publish Date - Jun 14 , 2024 | 12:59 AM
పట్టణంలోని మెయిన్‌రోడ్డులో ఉన్న జీవీఎంసీ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖాధికారిణి ఎం. వెంకటలక్ష్మమ్మ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న డీఈవో వెంకటలక్ష్మమ్మ
అనకాపల్లి టౌన్, జూన్ 13: పట్టణంలోని మెయిన్‌రోడ్డులో ఉన్న జీవీఎంసీ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖాధికారిణి ఎం. వెంకటలక్ష్మమ్మ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలు ప్రారంభమైన సందర్భంగా ఆమె విద్యార్థుల ప్రార్థనా సమయంలో పాఠశాలకు వచ్చి తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి ఉపాఽధ్యాయులతో మాట్లాడారు. ఉపాధ్యాయులందరూ వచ్చింది? లేనిది? ఆరా తీశారు. పాఠశాలకు వచ్చే పాఠ్యపుస్తకాలను విద్యార్థులందరికీ సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిబద్ధతతో పని చేసి విద్యార్థులకు పాఠ్యాంశాలు అందించాలని సూచించారు.
Updated Date - Jun 14 , 2024 | 12:59 AM