సీఎం ప్రమాణ స్వీకారం ప్రత్యక్ష ప్రసారం
ABN, Publish Date - Jun 12 , 2024 | 12:48 AM
రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారని, ఈ కార్యక్రమాన్ని ప్రజలంతా ప్రత్యక్షంగా వీక్షించేలా ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ ఎం.విజయసునీత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రజలు వీక్షించేలా వివిధ ప్రాంతాల్లో ఎల్‌ఈడీ స్కీన్ల ఏర్పాట్లు
జిల్లా కలెక్టర్ ఎం.విజయసునీత
పాడేరు, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారని, ఈ కార్యక్రమాన్ని ప్రజలంతా ప్రత్యక్షంగా వీక్షించేలా ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ ఎం.విజయసునీత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని రంపచోడవరం ఎంపీడీవో కార్యాలయం, అరకులోయలోని గిరిజన మ్యూజియమ్ సమీపంలో, పాడేరు అంబేడ్కర్ సెంటర్‌లో బుధవారం ఉదయం 10 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం వీక్షించేందుకు వీలుగా అవసరమైన ఎల్‌ఈడీ స్ర్కీన్‌లను ఏర్పాటు చేశామన్నారు. విజయవాడలోని కేసరపల్లిలో జరిగే సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని స్థానికంగా ఏర్పాటు చేసే ప్రత్యక్ష ప్రసారాల్లో ప్రజలంతా వీక్షించాలని కోరారు.
Updated Date - Jun 12 , 2024 | 12:48 AM