మార్కెట్‌కు అంగన్‌వాడీ కోడి గుడ్లు
ABN, Publish Date - Jul 17 , 2024 | 11:57 PM
జీకేవీధి మండలం ధారకొండ పంచాయతీ పరిధిలోని కమ్మరితోట అంగన్‌వాడీ కేంద్రం నుంచి కోడి గుడ్లను అక్రమంగా ధారకొండ మార్కెట్‌కు తరలిస్తుండగా గ్రామస్థులు మంగళవారం రాత్రి పట్టుకున్నారు. దీనిపై అంగన్‌వాడీ నిర్వాహకురాలు, ఆమె భర్తను నిలదీశారు.
తరలిస్తుండగా పట్టుకున్న కమ్మరితోట గ్రామస్థులు
అంగన్‌వాడీ నిర్వాహకురాలిని నిలదీసిన వైనం
ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
అప్పటి వరకు పిల్లలను కేంద్రానికి పంపించేది లేదని వెల్లడి
సీలేరు, జూలై 17: జీకేవీధి మండలం ధారకొండ పంచాయతీ పరిధిలోని కమ్మరితోట అంగన్‌వాడీ కేంద్రం నుంచి కోడి గుడ్లను అక్రమంగా ధారకొండ మార్కెట్‌కు తరలిస్తుండగా గ్రామస్థులు మంగళవారం రాత్రి పట్టుకున్నారు. దీనిపై అంగన్‌వాడీ నిర్వాహకురాలు, ఆమె భర్తను నిలదీశారు.
ప్రభుత్వం బాలింతలు, గర్భిణులు, చిన్నారుల పౌష్ఠికాహారం కోసం అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే కోడి గుడ్లను వారికి అందజేయకుండా అంగన్‌వాడీ నిర్వాహకులు పక్కదారి పట్టించి వాటిని మార్కెట్‌లో దుకాణాలకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కమ్మరితోట గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం నిర్వాహకురాలు రెడ్డి జయంతి తన భర్త ద్వారా 5 అట్టల గుడ్లు (150 గుడ్లు) ధారకొండ తరలించేందుకు తుప్పల మాటున సిద్ధం చేసి ఉంచారు. ఈ విషయం తెలిసి గ్రామస్థులు అక్కడికి చేరుకుని అంగన్‌వాడీ నిర్వాహకురాలు, ఆమె భర్తను నిలదీశారు. గత ఏడాది నవంబరు నుంచి ఇప్పటి వరకు గ్రామంలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం సరఫరా చేసే పాలు, గుడ్లు, ఇతర పౌష్ఠికాహారం సక్రమంగా సరఫరా చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్‌వాడీకి వచ్చే కోడి గుడ్లను పక్కదారి పట్టిస్తున్న నిర్వాహకురాలిపై చర్యలు తీసుకోవాలని అధికారులను గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు తమ పిల్లలను అంగన్‌వాడీ కేంద్రానికి పంపించేది లేదని తేల్చి చెబుతున్నారు.
Updated Date - Jul 17 , 2024 | 11:57 PM