అదుపుతప్పిన కారు
ABN, Publish Date - May 26 , 2024 | 12:37 AM
ఒక యువకుడు తెలిసీ తెలియక బ్రేక్‌కు బదులు ఎక్స్‌లేటర్ తొక్కడంతో కారు దూసుకుపోయి తండ్రీ కొడుకు గాయపడిన సంఘటన దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
బ్రేక్ వేయబోయి ఎక్స్‌లేటర్ తొక్కిన 19 ఏళ్ల యువకుడు
ద్విచక్ర వాహనం, చెట్టు, గోడలను ఢీకొని బోల్తా
ఇద్దరికి గాయాలు
కూర్మన్నపాలెం, మే 25:
ఒక యువకుడు తెలిసీ తెలియక బ్రేక్‌కు బదులు ఎక్స్‌లేటర్ తొక్కడంతో కారు దూసుకుపోయి తండ్రీ కొడుకు గాయపడిన సంఘటన దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 86వ వార్డు వుడా నగర్ సమీపంలోని ద్వారకాపురి కాలనీకి చెందిన ఉక్కు విశ్రాంత ఉద్యోగి బల్ల వందన్‌రాజు శనివారం ఉదయం తన కుమారుడు భానుప్రకాశ్‌రాజు (19)కు కారు తాళాలు ఇచ్చి హ్యాండ్ బ్రేక్ వేసి రావాల్సిందిగా చెప్పారు. అయితే అతను సరదాగా కాసేపు కారులో తిరుగు దామని వుడా నగర్ నుంచి పకీరుతఖ్యా వైపు వెళ్లాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా స్పీడ్ బ్రేకర్ కనిపించడంతో బ్రేక్ వేయబోయి ఎక్స్‌లేటర్ తొక్కాడు. దీంతో కారు అదుపుతప్పి ఆటోనగర్ నుంచి కూర్మన్నపాలెం వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్న తండ్రీకొడుకులు ఎస్.జగన్మోహన్‌రావు (41), ఎస్.కుశ్వంత్ (12)లను ఢీకొంది. అనంతరం గ్లోరియో స్కూల్ చెట్టును, గోడను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమా దంలో గాయపడిన జగన్మోహన్‌రావు, కుశ్వంత్‌లను స్థాని కులు గాజువాకలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కుశ్వంత్ కాలికి తీవ్ర గాయం కావడంతో వైద్యులు ఆపరేషన్ చేయాలని చెప్పినట్టు అతని తండ్రి జగన్మోహన్ రావు తెలిపారు. కాగా భానుప్రకాశ్‌రాజు సురక్షితంగా బయటపడ్డాడు. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డులో ప్రమాద సమయంలో పెద్దగా జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ఏసీపీ టి.త్రినాథ్, దువ్వాడ సీఐ ఎర్రంనాయుడు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి కారణమైన భానుప్రకాశ్ రాజును అదుపులోకి తీసుకున్నారు. జగన్మోహన్‌రావు ఫిర్యాదు మేరకు భానుప్రకాశ్‌రాజుతో పాటు వందన్‌రాజుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లైసెన్సు లేని పిల్లలకు వాహనాలిస్తే
తల్లిదండ్రులపైనా కేసులు: ఏసీపీ
లైసెన్స్ లేని యువతకు, పిల్లలకు వాహనాలు ఇవ్వడం నేరమని ఏసీపీ త్రినాథ్ అన్నారు. అలాంటి వారు వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమైతే తల్లిదండ్రులపైనా చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా డ్రైవింగ్‌లో పూర్తి శిక్షణ పొంది, తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలన్నారు. వాహనచోదకులు తప్పనిసరిగా హెల్మెట్/సీటు బెల్ట్ ధరించాలని సూచించారు.
Updated Date - May 26 , 2024 | 12:37 AM